![]() |
![]() |

తమిళ చిత్ర రంగంలో వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తు ముందుకు వెళ్లే హీరోల్లో శివ కార్తికేయన్ ఒకడు.అంతే కాకుండా ఆయన నటించిన సినిమాలు తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతుంటాయి. ఇప్పుడు మరికొన్ని రోజుల్లో ఆయన నుంచి అయలాన్ అనే సై ఫై బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఒక సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక సంచలన వార్త సోషల్ మీడియాని కుదిపేస్తుంది.
ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో కథానాయకుడుగా చేసిన సిద్దార్ధ్ అయలాన్ లో నటించే ఒక క్యారక్టర్ కి తన గొంతుని అందించబోతున్నాడు. ఈ సినిమాలో శివ కార్తికేయన్ తో పాటు ఏలియన్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది.ఏలియన్ ని గ్రహాంతరవాసి అని అర్ధం. ఇప్పుడు ఈ ఏలియన్ కి సిద్దార్ధ్ తన వాయిస్ ఓవర్ ని అందించాడు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ తమ ట్విటర్ ద్వారా అధికారకంగా ప్రకటించింది.ఆర్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో శివ కార్తికేయన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కే ఆర్ జె స్టూడియోస్ భారీ బడ్జెట్ తో ఈ అయలాన్ ని నిర్మిస్తుంది.

కాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం సంక్రాంతి కానుకగా అయలాన్ విడుదల కాబోతుందనే మాటలు వినిపిస్తున్నాయి. శివ కార్తికేయన్ సినిమాలు తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ అవుతాయి. మరి తెలుగులో సంక్రాంతికి చాలా సినిమాలు విడుదల కాబోతున్నాయి.
![]() |
![]() |