![]() |
![]() |
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. టాలీవుడ్ నుంచి మొదట స్పందించిన మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.
చిరంజీవి తన సందేశంలో.. ‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టిన రేవంతరెడ్డిగారికి శుభాకాంక్షలు. మీ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. అలాగే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన భట్టి విక్రమార్కకు కూడా చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త మంత్రివర్గానికి చిత్ర పరిశ్రమ నుంచి శుభాకాంక్షలు తెలిపిన మొదటి వ్యక్తి చిరంజీవే కావడం విశేషం. రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గురువారం ఎల్.బి.స్టేడియంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై రేవంత్‌రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతోపాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావులతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు రాష్ట్ర గవర్నర్ తమిళసై.
![]() |
![]() |