![]() |
![]() |

నాగ చైతన్య నుండి వచ్చిన దూత వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటిటి లో దుమ్ము లేపుతుంది. ఇందులో యూట్యూబర్ కిరణ్ పాత్రలో కనిపించిన జ్ఞానేశ్వరి కి ప్రేక్షకుల నుంచి మంచి పేరు వస్తుంది. దెయ్యాల మీద రీసెర్చ్ చేసే పాత్రకు దూత కథ లో మంచి ఇంపార్టెన్స్ ఉంది. తాజాగా ఆమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మీద చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తున్నాయి.
జ్ఞానేశ్వరి తాజాగా ఒక ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఛానెల్ లో జ్ఞానేశ్వరి మాట్లాడుతు నాకు రామ్ చరణ్ అంటే పిచ్చి నా బుక్స్ నిండా రామ్ చరణ్ ఫోటోలే ఉంటాయి. ఓ పదేళ్ల క్రితం కనుక నేను రామ్ చరణ్ గారిని కలిసుంటే పెళ్లి చేసుకుంటారా అని అడిగేదాన్ని. కానీ ఇప్పుడు చరణ్ గారికి పెళ్లయ్యింది కాబట్టి ఇప్పుడు కలిస్తే మాత్రం మీతో కలిసి సినిమాలో నటించాలని ఉందని అడుగుతానని కూడా జ్ఞానేశ్వరి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం జ్ఞానేశ్వరి మాట్లాడిన ఈ మాటలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
జ్ఞానేశ్వరి రీసెంట్ గా నవీన్ చంద్ర,స్వాతి హీరో హీరోయిన్లుగా వచ్చిన మంత్ ఆఫ్ మధు అనే సినిమాలో నటించింది. స్వాతి, నవీన్ చంద్రల కంటే జ్ఞానేశ్వరి పోషించిన పాత్రకే మంచి గుర్తింపు వచ్చింది. గ్లామరస్ పాత్రలో నవీన్ చంద్రతో డేట్‌కు సిద్ద పడుతు మోడ్రన్ లుక్, చీరకట్టు ఇలా అన్నింట్లో కనిపించి కవ్వించింది. ఇప్పుడు తాజాగా దూతతో జ్ఞానేశ్వరి పేరు మారు మోగిపోతుంది .దూత లో మధ్యలోనే చనిపోయే పాత్రే అయినా కూడా కనిపించినంత సేపు మాత్రం తన నటనతో అందర్నీ ఆకట్టుకున్న జ్ఞానేశ్వరి వైజాగ్ కి చెందిన అచ్చ తెలుగు అమ్మాయి.
![]() |
![]() |