![]() |
![]() |

లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించే దర్శకుడు మణిరత్నం కాంబినేషన్ లో వస్తున్న సినిమా థగ్ లైఫ్. సుమారు 30 సంవత్సరాలు తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రూపుదిద్దుకుంటుంది.ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన హీరోయిన్ విషయం లో వస్తున్న ఒక వార్త టాక్ అఫ్ ది ఇండియన్ సినిమా అయ్యింది.
కమల్ సినీ కెరీర్ లో 234 వ సినిమాగా తెరకెక్కబోతున్న థగ్ లైఫ్ లో కమల్ హాసన్ సరసన హీరోయిన్ గా మొదట త్రిష,నయనతార పేర్లు వినిపించాయి. ఆ తర్వాత వాళ్లిద్దరు కాకుండా ఐశ్వర్య రాయ్ పేరు కూడా వినిపించింది. ఒక దశలో ఐశ్వర్య పేరు దాదాపుగా ఖాయమైంది. మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు గాని ఐశ్వర్య ప్లేస్ లో మంజు వారియర్ ను ఫైనల్ చేశారనే టాక్ తమిళ చిత్ర పరిశ్రమలో వినపడుతుంది.
ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీత సారధ్యంలో తెరకెక్కతున్న థగ్ లైఫ్ ని మణిరత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.వీలైనంత త్వరగా షూటింగ్ ని ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాని రిలీజ్ చేయాలనే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు. ఈ చిత్రం సహ నిర్మాతలలో కమల్ కూడా ఒకరు. మణిరత్నం కమల్ కాంబో లో వచ్చిన నాయకుడు ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిన విషయమే.
![]() |
![]() |