![]() |
![]() |

రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన సినిమా 'యానిమల్'. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తెలుగునాట కూడా అంచనాలకు మించిన వసూళ్లతో సంచలనాలు సృష్టిస్తోంది. ఫస్ట్ వీకెండ్ లోనే తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ భారీ ప్రాఫిట్స్ చూసేలా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.15.40 కోట్ల గ్రాస్ రాబట్టిన యానిమల్.. రెండో రోజు రూ.12.45 కోట్ల గ్రాస్, మూడో రోజు రూ.12.20 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. దీంతో మూడు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.40.05 కోట్ల గ్రాస్ (రూ.20.65 కోట్ల షేర్) రాబట్టింది. తెలుగునాట దాదాపు రూ.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన యానిమల్.. ఇప్పటికే రూ.5 కోట్లకు పైగా లాభాలను చూడటం విశేషం. ఫుల్ రన్ లో ఈ సినిమా మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశముంది.
ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని పరిశీలిస్తే యానిమల్ ఇప్పటిదాకా రూ.350 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. త్వరలోనే రూ.500 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరనుంది.
![]() |
![]() |