![]() |
![]() |
ఒకప్పుడు సినీ ప్రముఖులు ఏదైనా సినిమా గురించి అద్భుతంగా ఉందని, ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అని చెబితే ప్రేక్షకులు నమ్మేవారు. వారిపై ఉన్న అభిమానం కొద్దీ వారి మాటను తీసి పారెయ్యకుండా సినిమాను చూసేవారు. కానీ, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ సంప్రదాయానికి గుడ్‌బై చెప్పారు ప్రేక్షకులు. ఎంత పెద్ద స్టార్ అయినా సినిమా గురించి తప్పుగా మాట్లాడినా, బాగాలేదు అనుకున్న సినిమాను బాగుంది అని చెప్పినా నమ్మడానికి సిద్ధంగా లేరు. అయితే అలాంటి సందర్భాలు చాలా అరుదుగా వస్తుంటాయి. తాజాగా అలాంటి విచిత్రమైన అనుభవం హీరోయిన్ త్రిషకు ఎదురైంది.
‘అర్జున్‌రెడ్డి’ చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా రూపొందించిన ‘యానిమల్’ మూవీ డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ‘యానిమల్’ మూవీ చాలా వైలెంట్‌గా ఉంది, లెంగ్త్ ఎక్కువైంది, అక్కడక్కడా ల్యాగ్ ఉంది, అసభ్యకర సన్నివేశాలు ఎక్కువయ్యాయి... మహిళలను తక్కువ చేసి చూపించారు.. అయినా సినిమా ఎక్స్‌లెంట్‌గా ఉంది..’ ఇవీ సినిమా చూసిన వారి నుంచి వస్తున్న మాటలు. ఇలాంటి కామెంట్లు చూసిన తర్వాత హీరోయిన్ త్రిష తను కూడా సినిమాపై స్పందించాలన్న ఉద్దేశంతో తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ‘యానిమల్’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది. సినిమాపై తన రివ్యూను ప్రజెంట్ చేసింది. అయితే అదే ఆమెను ఇప్పుడు చిక్కుల్లో పడేసింది. ఈ సినిమా గురించి ఒకే ఒక్క పదంలో చెప్తాను ‘కల్ట్.. వాప్‌ా’ అంటూ ఓ మేధావి లెవల్‌లో సినిమాని అప్రిషియేట్ చేసింది. త్రిష రివ్యూ చూసిన నెటిజన్లు, ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆమెపై ఫైర్ అయ్యారు. ‘నువ్వు అసలైన స్త్రీవాదివేనా? మహిళలను అంత దారుణంగా అవమానించిన ఇలాంటి సినిమాను పొగుడుతావా?’ అంటూ సీరియస్ అయ్యారు. మహిళలను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసినా.. త్రిష మాత్రం ఈ సినిమాను ఆకాశానికెత్తేసి మోసెయ్యడం అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది. ‘యానిమల్’ పోస్టర్‌ను షేర్ చేస్తూ ఈ పోస్ట్ చేసింది. త్రిష ఈ పోస్ట్ పెట్టిన క్షణం నుంచి ఆమెను ట్రోల్ చెయ్యడం మొదలు పెట్టారు. రకరకాల కామెంట్స్ పెడుతూ ఆమెకు ఊపిరి సలపనివ్వడం లేదు నెటిజన్లు.
ఇటీవల త్రిషపై మన్సూర్ అలీఖాన్ చేసిన కామెంట్స్‌పై ఎంత పెద్ద రభస జరిగిందో అందరికీ తెలిసిందే. ఈ విషయంలో త్రిషపై అందరూ కరుణ చూపించారు, తమ మద్దతు తెలిపారు. సినీ ప్రముఖులు సైతం ఆమెకు అండగా నిలబడ్డారు. ఈ విషయంలో మన్సూర్.. త్రిషకు క్షమాపణ చెప్పేవరకు ఊరుకోలేదు. అలాంటి త్రిష ఇప్పుడు ‘యానిమల్’ సినిమా గురించి ఇంత పాజిటివ్‌గా మాట్లాడడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ‘నువ్వు ఓ నకిలీ ఫెమినిస్ట్‌వి’ అంటూ ఆమెను టార్గెట్ చేశారు అభిమానులు. నెటిజన్ల తాకిడి తట్టుకోలేని త్రిష తను పెట్టిన పోస్ట్‌ని డిలీట్ చేసేసింది. డిసెంబర్ 3 ఆదివారం రోజున త్రిష ఈ పోస్ట్ పెట్టింది. పెట్టిన కొంత సమయానికే సోషల్ మీడియాలో రచ్చ మొదలయ్యేసరికి త్రిష తన ఇన్‌స్టా నుంచి మొహం చాటేసింది. ఫ్యాన్స్ నుంచి, నెటిజన్ల నుంచి వచ్చిన రియాక్షన్‌తో ఒక్కసారిగా షాక్ అయింది. మన్సూర్ అలీ ఖాన్ విషయంలో త్రిషకు మద్దతుగా కామెంట్స్ పెట్టిన అభిమానులే ఇప్పుడు ఆమెను ట్రోల్ చేస్తూ ఆమెను టెన్షన్ పెడుతున్నారు. ఆమె పోస్ట్ డిలీట్ చేసినా ఆ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
![]() |
![]() |