Home

»

Latest News

వెంకటేష్, రవితేజ మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరు?

Dec 4, 2023 11:06AM

అందరి హీరోల అభిమానులు ఇష్టపడే అతికొద్ది మంది హీరోలలో వెంకటేష్, రవితేజ ముందు వరుసలో ఉంటారు. అలాంటిది ఈ ఇద్దరు కలిసి మల్టీస్టారర్ చేస్తే ఎలా ఉంటుంది. ప్రేక్షకులు సినిమా చూడటానికి క్యూ కడతారు. త్వరలోనే అలాంటి రోజు రాబోతుందని తెలుస్తోంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్.. వెంకటేష్, రవితేజలతో ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తుందట. ఇదొక కామెడీ ఎంటర్టైనర్ అని సమాచారం. వెంకటేష్, రవితేజ ఇద్దరూ కామెడీ చేయడంలో దిట్ట. ఈ ఇద్దరు కలిస్తే ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. ఇక ఈ క్రేజీ మల్టీస్టారర్ కోసం ఓ యంగ్ డైరెక్టర్ ని రంగంలోకి దింపుతున్నట్లు వినికిడి.

వెంకటేష్ ప్రస్తుతం సైంధవ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది సంక్రాంతికి విడుదల కానుంది. అలాగే రవితేజ నటిస్తున్న ఈగల్ కూడా సంక్రాంతికే రానుంది. ఒకవేళ వీరి కలయికలో మల్టీస్టారర్ ఓకే అయితే వచ్చే ఏడాది పట్టాలెక్కే అవకాశముంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com