![]() |
![]() |

అక్కినేని అండ్ మెగా కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యం ఈ నాటిది కాదు. మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావు దగ్గర నుంచి ఆ రెండు కుటుంబాల మధ్య ఎంతో అనుబంధం కొనసాగుతు ఉంది.మెగాస్టార్ , ఏయన్ఆర్ ని గురువు గారు అంటూ ఆప్యాయంగా పిలుస్తారు. అలాగే చిరంజీవి ఫారెన్ వెళ్ళినప్పుడల్లా నాగేశ్వరరావు గారికి గిఫ్ట్ లని కూడా తీసుకొచ్చి ఇస్తుంటారు. ఇదే అనుబంధాన్ని కంటిన్యూ చేస్తు చిరంజీవి నాగార్జునలు కూడా చాలా సోదర భావంతో మెలుగుతు ఉంటారు. ఒకరంటే ఒకరికి చాలా అభిమానం. కానీ ఆ బంధం చిరు నాగ్ ల వరకే కాదు అని నిరూపితమైన ఒక సంఘటన మెగా అక్కినేని కుటుంబాలకి చెందిన ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ ని తీసుకొస్తుంది.
పవన్ కళ్యాణ్ తాజాగా వైజాగ్ లో ఉన్న మత్యకారుల కుటుంబాలని పరామర్శించడానికి వెళ్లాడనే విషయం అందరికి తెలిసిందే. పవన్ అక్కడికి వెళ్లే ముందు కొన్ని అనివార్య కారణాల వలన పవన్ వెళ్ళాలసిన ఫ్లైట్ మిస్ అయ్యింది. దాంతో పవన్ కళ్యాణ్ నాగార్జున కి ఫోన్ చేసి పరిస్థితి వివరించగానే నాగ్ తన ప్రత్యేక ఫ్లైట్ ని పవన్ కళ్యాణ్ కి పంపించాడు. నాగ్ కి చెందిన ఆ ఫ్లైట్ లోనే పవన్ వైజాగ్ వెళ్ళాడు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
ఇన్నాళ్లు నాగార్జునకి ,చిరంజీవి కి మధ్యనే చాలా సాన్నిహిత్యం ఉందని అందరు భావించేవారు. ఎప్పుడు కూడా పవన్ కి నాగార్జున కి మధ్య అంత బాండింగ్ ఉందని ఎవరికీ తెలియదు. ఇదంతా ఎందుకు చెప్పవలిసి వస్తుందంటే నాగార్జున తన ప్రత్యేక ఫ్లైట్ ని బయట వ్యక్తులకి ఇవ్వడు.కేవలం తను,నాగ చైతన్య,అఖిల్ మాత్రమే దాన్ని వాడతారు. అలాంటిది పవన్ అడగ్గానే నాగ్ ఫ్లైట్ ని పంపించాడంటే వాళ్ళిద్దరి మధ్య బయట ప్రపంచానికి తెలియని అన్యోన్యత ఉందని అందరు అనుకుంటున్నారు.
![]() |
![]() |