![]() |
![]() |
మంచు ఫ్యామిలీలో గొడవలు, వివాదాలు, అన్నదమ్ముల మధ్య, అక్క తమ్ముళ్ళ మధ్య కోల్డ్ వార్... ఇలా ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఆమధ్య మంచు విష్ణు గొడవ చేసిన వీడియోను మనోజ్ షేర్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో కూడా పెద్ద రచ్చే జరిగింది. ఈ విషయం మోహన్‌బాబు వరకు వెళ్ళడంతో ఆయన కూడా ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు. అయితే అది గొడవ కాదని, ఒక రియాలిటీ షో అని విష్ణు కవర్ చెయ్యాలని చూశాడు. అతను చెప్పిన దాంట్లో నిజం లేదని నెటిజన్లు కామెంట్ చేశారు. విష్ణు, మనోజ్‌ల మధ్య ఎప్పటి నుంచో వివాదాలు నడుస్తున్నాయని, ఇద్దరూ విడిగానే ఉంటున్నారని ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటుంది. మనోజ్, మౌనికల పెళ్లిలోనూ విష్ణు అంతగా సందడి చేయకపోవడం కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలకు బలం చేకూరుస్తోంది. అంతే కాదు సోషల్ మీడియాలో ఎప్పుడూ మనోజ్, లక్ష్మీ మాత్రమే కనిపిస్తూ ఉంటారు.
తాజాగా సంపూర్ణేష్‌బాబు హీరోగా నటిస్తున్న ‘సోదర’ మూవీ పాటను రిలీజ్ చేసేందుకు మంచు మనోజ్ హాజరయ్యాడు. సినిమా టైటిల్ సోదర కావడంతో.. సోదర బంధం గురించి మనోజ్ ప్రస్తావించాడు. బ్రదర్స్ మధ్య ఎలాంటి బాండిరగ్ ఉండాలనేది వివరించే ప్రయత్నం చేశాడు. బ్రదర్స్ మధ్యలో ఇగోలు, డబ్బు సమస్యలు రాకూడదని, అవి వస్తే ఇక అంతేనంటూ మనోజ్ వ్యాఖ్యానించాడు. దీంతో అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయనే విషయాన్ని మనోజ్ స్పష్టం చేసినట్టుగా ఉందని అందరూ భావిస్తున్నారు.
![]() |
![]() |