![]() |
![]() |

అక్కినేని వారి చెంత మరొక రికార్డు వచ్చి చేరింది. యువ సామ్రాట్ నాగ చైతన్య నుంచి ఫస్ట్ టైం వస్తున్న వెబ్ సిరీస్ మూవీ దూత. తాజాగా దూత నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఈ ట్రైలర్ విషయంలో చై ఒక సరికొత్త రికార్డు సృష్టించాడు.
దూత ట్రైలర్ 3 .5 మిలియన్ వ్యూస్ తో టాప్ లో నిలిచింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన యు ట్యూబ్ లో అక్షరాల 3 .5 మిలియన్ వ్యూస్ తో దూత ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ లో ఛైతన్య జర్నలిస్ట్ క్యారక్టర్ లో సూపర్ గా ఉన్నాడు. ట్రైలర్ ని చూసిన దాన్ని బట్టి జర్నలిస్ట్ అయిన చైతన్య ఒక మర్డర్ కేసులో ఇరుక్కొని ఆ తర్వాత ఆ కేసు నుండి ఎలా బయట పడ్డాడు అనే కధాంశంతో దూత రాబోతున్నట్టుగా ఉంది.అసలు జర్నలిస్ట్ అనే వాడు ఎలా ఉండాలో కూడా దూతలో చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే చైతన్య నోటి వెంట మేము మెసెంజర్స్ మి అంటే దూతలం అని రావడంతో ఈ సిరీస్ మీద ప్రేక్షకుల్లో అంచనాలు పీక్స్ లో ఏర్పడ్డాయి. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ దూత కోసం అక్కినేని ఫాన్స్ తో పాటు సినీ అభిమానులు కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. విలక్షణ చిత్రాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ దూత డిశంబర్ 1 న తెలుగుతో పాటు తమిళ ,మలయాళ ,కన్నడ, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల కాబోతుంది. శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
![]() |
![]() |