![]() |
![]() |

కొన్నేళ్లుగా తెలుగు సినిమా స్థాయి పెరుగుతూ వస్తోంది. దాంతో ఇతర భాషలకు చెందిన పలువురు నటీనటులు హైదరాబాద్ లో ఉండటానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తెలుగు నటి మంచు లక్ష్మి మాత్రం అందుకు భిన్నంగా ముంబైకి మకాం మార్చింది. దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆమె హైదరాబాద్ విడిచి ముంబై వెళ్ళడానికి ఓ రకంగా ఆమె సోదరుడు మంచు మనోజ్ తో పాటు రానా దగ్గుబాటి కారణమని చెప్పవచ్చు.
ముంబైకి మకాం మార్చడంపై తాజాగా హిందీ మీడియాతో మాట్లాడిన లక్ష్మి.. "హైదరాబాద్ లో నాతో పాటు తమ్ముడు మనోజ్ ఉండేవాడు. అయితే తను పెళ్ళి చేసుకొని వెళ్లిపోవడంతో లోన్లీ ఫీలింగ్ వచ్చింది. అదే సమయంలో నా ఫ్రెండ్ రానాకి ఫోన్ చేస్తే అతను తన కెరీర్ గురించి, బిజినెస్ గురించి సీరియస్ గా మాట్లాడుతున్నాడు. దాంతో నాకు భయమేసింది. నేనేంటి?, ఎక్కడున్నాను? అని నన్ను నేను ప్రశ్నించుకొని, హైదరాబాద్ వదిలి వెళ్ళే టైం వచ్చిందని డిసైడ్ అయ్యాను. అలా ముంబై వచ్చాను. ఎప్పుడూ ఒకే చోట ఉంటే నాకు బోర్ కొడుతుంది. అక్కడ నేను అందరికీ తెలుసు, ఇక్కడ నన్ను నేను కొత్తగా పరిచయం చేసుకోవాలి. కెరీర్ ని ఫస్ట్ నుండి స్టార్ట్ చేయాలి. ఇలాంటి ఛాలెంజెస్ అంటే నాకిష్టం." అని చెప్పుకొచ్చింది.
ఇక ముంబైలో ఇల్లు దొరకడం చాలా కష్టమని చెప్పిన లక్ష్మి.. తన ఫ్రెండ్ రకుల్ ప్రీత్ సింగ్ వల్ల ఆ పని ఈజీ అయిందని తెలిపింది.
![]() |
![]() |