![]() |
![]() |

తను నిర్మించిన సినిమా సూపర్‌హిట్ అవ్వాలి, మంచి కలెక్షన్లు రాబట్టాలి అనే ప్రతి నిర్మాతా భావిస్తాడు. దానికి తగ్గట్టుగానే ఎంత బడ్జెట్ పెట్టడానికైనా సిద్ధపడతాడు. ఇక రిలీజ్‌కి వచ్చేసరికి ప్రమోషన్స్‌తో తమ సినిమా జనంలోకి వెళ్ళేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత రివ్యూలు ఎలా వస్తాయి, ఎవరు ఎలా రాశారు అనే దానిమీద దర్శకనిర్మాతలు దృష్టి పెడుతుంటారు. అయితే కొందరు దర్శకనిర్మాతలు మాత్రం తమకు సినిమా మీద ఉన్న నమ్మకంతో రివ్యూల గురించి పట్టించుకోరు. రివ్యూల వల్ల సినిమా ఫలితం మారదని వారి నమ్మకం. అయితే ఈమధ్యకాలంలో అంత కాన్ఫిడెంట్‌గా ఉన్న నిర్మాతలు కనిపించలేదు. ప్రస్తుతం మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ చిత్రాన్ని నిర్మిస్తున్న సూర్యదేవర నాగవంశీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టు కనిపిస్తున్నారు. తమ సినిమా పక్కా బ్లాక్‌బస్టర్ అనీ, అసలు రివ్యూల అవసరమే లేదంటున్నారు. అంత నమ్మకంగా చెబుతున్నారంటే సినిమాలో విషయం ఉందన్నమాట. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన మొదటి పాట అందర్నీ ఆకట్టుకుంటోంది. రెండో పాటను కూడా త్వరలోనే రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.
సినిమాపై నిర్మాత నాగవంశీ అంత కాన్ఫిడెంట్‌గా ఉండడానికి కారణం కంటెంట్ అని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. నాగవంశీకే కాదు, యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ ‘గుంటూరు కారం’ బ్లాక్‌బస్టర్ హిట్ అంటున్నారు. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా ఇది. మరి ఈ కాంబినేషన్‌లో మరోసారి మ్యాజిక్ చేస్తుందో లేదో చూడాలి.
![]() |
![]() |