![]() |
![]() |

బిగ్ బాస్ 4 సీజన్ లో పాల్గొన్న నటి స్వాతి దీక్షిత్.. ఆ సీజన్ లో బిగ్ బాస్ విన్నర్ గా నిలవకపోయినా హౌస్ లో ఉన్నన్ని రోజులు కూడా ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుంది. తాజాగా జరిగిన ఒక సంఘటనతో వార్తల్లోకి ఎక్కింది.
అమెరికాకి చెందిన ఒక మహిళకి జూబ్లీ హిల్స్ లో ఇల్లు ఉంది. ఆ ఇల్లు లీజు కి సంబంధించిన విషయంలో సదరు మహిళకి స్వాతి దీక్షిత్ కి మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతు ఉన్నాయి. ఆల్రెడీ కోర్ట్ లో ఆ విషయం మీద కేసు కూడా నడుస్తు ఉంది. ఈ క్రమంలో స్వాతి కొంత మందితో కలిసి ఆ ఇంట్లోకి ప్రవేశించి వాచ్ మెన్ ని చంపుతామని బెదిరించి ఇంటిని కబ్జా చేయడానికి ప్రయత్నించింది. దీంతో వాచ్ మాన్ పోలీసులకి ఫిర్యాదు చెయ్యడంతో రంగంలోకి దిగిన పోలీసులు స్వాతితో పాటు ఆమెతో వచ్చిన వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏఎస్.రవి కుమార్ చౌదరి దర్శకత్వంలో 2010 లో వచ్చిన ఏం పిల్లో ఏం పిల్లడో చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన స్వాతి దీక్షిత్ ఆ తర్వాత దెయ్యం, జంప్ జిలాని,గమ్మత్తు లాంటి చిత్రాల్లో నటించింది. బిగ్ బాస్ 4 సీజన్ ద్వారా ఫేమస్ అయిన స్వాతి కబ్జాకి ప్రయత్నించిన ఇంటి విలువ సుమారు 30 కోట్లు.
![]() |
![]() |