![]() |
![]() |
మెగా ఫ్యామిలీలో నిహారిక కొణిదెలకు ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే.. మెగా ఫ్యామిలీలో హీరోలే తప్ప హీరోయిన్లు లేరు. ఆ కొరత తీర్చింది నిహారిక. మొదట ఢీ షోతో ఎంటర్ అయిన ఆమె ఆ తర్వాత హీరోయిన్‌గా పలు సినిమాల్లో కనిపించింది. తను లైఫ్‌లో మొట్ట మొదటిసారి మేకప్ వేసుకుంది ఢీ షోకే అని చెబుతుందామె. హీరోయిన్‌గా రాణించే ప్రయత్నం చేసినప్పటికీ ఆమెకు సరైన ఆదరణ లభించలేదు. కెరీర్ పరంగా ఆమెకు ఎలాంటి తృప్తి లభించలేదు. ఆ తర్వాత జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకుంది. ఆమె దాంపత్య జీవితం కూడా సజావుగా సాగలేదు. దాంతో ఇద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ప్రస్తుతం వెబ్ సిరీస్ నిర్మాణం చేపట్టి అందులో బిజీ అయిపోయింది. అలాగే సినిమా నిర్మాణం వైపు కూడా అడుగులు వేస్తోంది. నిర్మాతగానయినా సక్సెస్ సాధించాలన్న పట్టుదలతో ఉంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూ తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి కొన్ని విశేషాలను చెప్పింది నిహారిక. తనకు చిన్నతనం నుంచి బంగారం అంటే ఎంతో ఇష్టమని, తనకోసం అమ్మ ఎన్నో రకాల డిజైన్స్‌తో నగలు తెప్పించేదని చెప్పింది. అయితే చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఎంతో బంగారం పోగొట్టుకుందట. తను పెట్టుకున్న నగలు ఉన్నాయో లేదో కూడా చూసుకునేది కాదట. బంగారం పోగొట్టుకోవడంలో తను ఎప్పుడూ నెంబర్ వన్‌గానే ఉండేదట. అయితే చిన్నతనంలోనే ఎక్కువ బంగారం పోగొట్టానంటోంది. చిన్నతనం నుంచి ఇప్పటివరకు తన వల్ల పోయిన బంగారంతో ఒక ఇల్లు కట్టుకోవచ్చు అని చెబుతోంది నిహారిక.
![]() |
![]() |