![]() |
![]() |
తమిళనటుడు మన్సూర్ అలీఖాన్ స్టార్ హీరోయిన్ త్రిషపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈయన త్రిష గురించి మాట్లాడుతూ.. ‘త్రిషతో మాట్లాడాలని చాలా సార్లు ప్రయత్నించాను. కానీ, కుదర్లేదు. లియోలో త్రిషతో పాటు కలిసి నటించే అవకాశం వచ్చింది. ఎంతో సంతోషించాను. ‘త్రిషతో కలిసి నటిస్తున్నానా? కచ్చితంగా బెడ్ రూము సీన్లు ఉంటాయని భావించాను. రోజాను, ఖుష్భూను బెడ్‌పై పడేసినట్లు పడేద్దామని అనుకున్నాను. 109 సినిమాల్లో నేను చేయనని రేపా? త్రిషను నా చేతుల్తో ఆంజనేయస్వామి కొండను ఎత్తుకుపోయినట్లు ఎత్తుకుపోయి.. కాశ్మీర్ మంచులో తీసుకుపోవాలని అనుకున్నాను. కానీ, ఆ ఛాన్సు ఇవ్వటం లేదు’ అంటూ మన్సూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు మన్సూర్‌కి కొత్తేమీ కాదు. గతంలో తమన్నాపై కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. జైలర్ సినిమాలో ఆమె అసభ్యకరంగా డ్యాన్స్ చేసిందని అన్నారు. కాళ్ల మధ్యలోకి చేతులు పోనిస్తూ దారుణంగా డ్యాన్స్ చేసిందని అన్నారు. దీనిపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జరిగిన నెల కూడా గడవక ముందే త్రిషపై అసభ్య వ్యాఖ్యలు చేశాడు.
ఈ వీడియో వైరల్‌గా మారడంతో త్రిష దృష్టికి కూడా వెళ్లింది. ఆ వీడియోపై త్రిష ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మన్సూర్ అలీఖాన్ నా గురించి దారుణంగా చెత్తగా మాట్లాడిన వీడియో ఒకటి నా దృష్టికి వచ్చింది. నేను ఆ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అతడికి నాతో కలిసి అలాంటి సీన్లలో చేయాలని ఆశ ఉండొచ్చు. దేవుడి దయ వల్ల అలాంటి నీచులతో స్క్రీన్ షేర్ చేసుకునే పరిస్థితి రాలేదు. ఇకపై కూడా నటించను. ఇలాంటి వారు మనుష జాతికే చెడ్డ పేరు తెస్తున్నారు’’ అంటూ ఆవేదనతో పాటు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.
టాలీవుడ్ హీరో నితిన్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘మన్సూర్ వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి ఉన్మాదులకు సమాజంలో చోటు లేదు. ఇలాంటి వారి వ్యాఖ్యలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది’ అన్నారు.
‘లియో’ చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్పందిస్తూ.. ‘త్రిషపై మన్సూర్ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయి. ఆయన ఒకే టీంలో కలిసి పనిచేశారు. మహిళల పట్ల గౌరవం ఉండాలి. నేను కచ్చితంగా ఈ ప్రవర్తను ఖండిస్తున్నాను’ అన్నారు. హీరోయిన్ మాళవిక మోహన్ స్పందిస్తూ.. ‘ఇది చాలా దారుణంగా ఉంది. మన్సూర్‌కు మహిళల పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో దీన్ని బట్టే తెలుస్తుంది. ఇది సిగ్గుచేటు. ఇలా మాట్లాడటానికి ఎంత ధైర్యం ఉండాలి’ అన్నారు.
నటి రోజా స్పందిస్తూ ‘ఆడవాళ్ల గురించి తప్పుగా మాట్లాడే మగాళ్లను శిక్షించడానికి చట్టపరమైన పోలీసు చర్యలు ఉండాలి. నా గురించి తప్పుగా మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే కావచ్చు.. త్రిష, ఖుష్భూ, నా గురించి తప్పుగా మాట్లాడిన మన్సూర్ అలీఖాన్ కావచ్చు. కఠినమైన చట్టపర చర్యలు తీసుకునే వరకు ఇలాంటి మగాళ్లు భయపడరు. మేము సినిమా, రాజకీయాల్లో రాణిస్తున్న మహిళలము.. అలాంటి మాకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఇతర మహిళల గురించి ఏం చెబుతాం’అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కార్తీక్ సుబ్బరాజు, సింగర్ చిన్మయి కూడా స్పందించారు. ఇది చాలా దారుణమని, మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారిని కఠినంగా శిక్షించాలని కోరారు.
మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలకు కోలీవుడ్, టాలీవుడ్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ప్రతి ఒక్కరూ అతని చేష్టలను తప్పు బడుతున్నారు. ఇక కోలీవుడ్‌లో అయితే పెద్ద దుమారమే చెలరేగుతోంది. పరిస్థితి చేయిదాటి పోతుందని భావించిన మన్సూర్ అలీఖాన్ తను వీడియోలో మాట్లాడిన దానిపై వివరణ ఇచ్చుకున్నాడు.
‘నాకు త్రిషపై మంచి అభిప్రాయం ఉంది. ఆమెను గౌరవిస్తాను. లియో చిత్రంలో ి త్రిష పాత్ర ఎంతో కీలకం కావడంతో తనను పర్వతాన్ని ఎత్తుకున్న ఆంజనేయుడితో పోల్చాను. ఆమెకు కాంప్లిమెంట్స్ ఇచ్చాను. కానీ, కొన్ని స్టేట్ మెంట్స్ మాత్రమే ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారు. అదే ఆమెకు చూపించారు. నేను ఎటువంటి బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదు. నాతో పనిచేసిన హీరోయిన్లు అంతా ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్నారు. వ్యాపార వేత్తలను పెళ్లి చేసుకున్నారు. నేను తోటి హీరోయిన్స్‌తో ఎలా ఉంటానో అందరికీ తెలుసు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో నా సినీ, రాజకీయ ప్రయాణాన్ని దెబ్బతీసేందుకు ఇలా చేశారు’ అంటూ వివరణ ఇచ్చాడు. అయితే దీన్ని నెటిజన్లు ఏమాత్రం నమ్మడం లేదు. ఎందుకంటే మన్సూర్‌కి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తకాదు. వివాదం రేగడం కోసం కావాలనే హీరోయిన్లపై అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని నెటిజన్లు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
![]() |
![]() |