![]() |
![]() |

ఏ ముహూర్తాన రచయితలు తమ కలంలో నుంచి రాయలసీమ నేపథ్యంలో జరిగే కథలు రాయటం ప్రారంభించారో గాని అప్పటి నుంచి రాయలసీమ నేపథ్యం తెలుగు సినిమా రంగానికి కాసుల వర్షాన్ని కురిపిస్తు ఉంది. చాలా మంది హీరోలు రాయసీమల కథల్లో నటించి తమ హీరో స్టేటస్ రేంజ్ ని పెంచుకున్నారు. ఇప్పుడు మాస్ మహారాజ రవితేజ కూడా అదే బాటలో పయనించి తన హీరో స్టేటస్ ని డబుల్ చేసుకోబుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న సినిమా రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కబోతుందనే ఒక వార్త సినీ పరిశ్రమలో హల్ చల్ చేస్తుంది. ఈ మేరకు చిత్ర బృందం నుంచి ఎటువంటి అధికార ప్రకటన రాకపోయినా కూడా మూవీ మాత్రం పక్కాగా రాయలసీమ నేపథ్యంలో జరగబోతుందనే మాటలు వినిపిస్తున్నాయి. రవితేజ పాత్ర సినిమాలో చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని, రవితేజ పూర్తిగా రాయలసీమ మాండలికంలోనే డైలాగ్స్ చెప్పబోతున్నాడని అంటున్నారు. రవితేజ చెప్పే ఆ డైలాగ్స్ సినిమాకే మెయిన్ హైలైట్ గా నిలుస్తాయని కూడా అంటున్నారు.
రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఇంతకు ముందే డాన్ శ్రీను, బలుపు, క్రాక్ లాంటి సినిమాలు వచ్చి సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. అలాగే ఆయా సినిమాల్లో రవితేజని గోపిచంద్ చాలా డిఫరెంట్ గా చూపించి రవితేజ సినీ కెరీర్ లోనే ఆ సినిమాలు బిగెస్ట్ హిట్ గా నిలిచేలా చేసాడు. ఇప్పుడు నాలుగోసారి ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న కథ రాయలసీమ నేపథ్యంలోనిది అయితే మాత్రం ఆ మూవీ తెలుగు సినిమా పరిశ్రమలో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం. గతంలో రాయలసీమ సినిమాల్లో నటించిన చాలా మంది హీరోలు చెప్పినట్లుగా రవితేజ నోటినుంచి కూడా రాయలసీమ నా ప్రాణం అనే మాట వినాలని రాయలసీమ రవి తేజ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ రవితేజ, గోపిచంద్ ల మూవీని నిర్మిస్తుంది.
![]() |
![]() |