![]() |
![]() |

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అండ్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ ఎంత పెద్ద హిట్ కాంబినేషనో తెలుగు సినిమా ప్రేక్షకులకి చెప్పాలిసిన అవసరం లేదు. జులాయి సినిమాతో ప్రారంభం అయిన ఆ ఇద్దరి ప్రస్థానం సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురం సినిమాలతో శిఖరాగ్రానికి చేరుకుంది. హ్యాట్రిక్ కొట్టిన ఈ కాంబోలో నాలుగో సినిమా రాబోతుందని కొన్ని రోజుల క్రితం అధికారికంగా ఒక ప్రకటన కూడా వచ్చింది. తాజాగా ఆ సినిమాకి సంబంధించిన కథ లైన్ ఇదే అనే ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఈ వార్తని చూసిన బన్నీ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు.
బన్నీ, గురూజీ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా భారత స్వాతంత్య్ర ఉద్యమం నాటి పరిస్థితుల నేపథ్యంలో జరిగే కథ అనే ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఇప్పటికే త్రివిక్రమ్ పూర్తి స్క్రిప్ట్ ని కూడా రెడీ చేసాడని అల్లు అర్జున్ కూడా ఆ స్క్రిప్టు కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సెట్స్ మీద కి వెళ్లనుంది. అలాగే మరికొన్నిరోజుల్లో మేకర్స్ నుంచి మూవీకి సంబంధించిన మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశముంది. త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్ లో ఇప్పటివరకు వచ్చిన అన్ని చిత్రాల కంటే మరింత హిట్ అయ్యేలా మేకర్స్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
300 కోట్ల బడ్జట్ తో తెరకెక్కే ఈ మూవీని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు అయిన గీత ఆర్ట్స్, హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. ఈ కాంబో లో 2020 సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురములో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సరికొత్త రికార్డులని సృష్టించింది. ఇప్పుడు ఈ మూవీని అంతకు మించి హిట్ చెయ్యాలనే కసితో చిత్ర యూనిట్ ఉంది.
![]() |
![]() |