![]() |
![]() |

ఇటీవల చాలా మంది సెలబ్రిటీలు వార్తల్లో ఉండాలని ఉబలాటపడుతున్నారు. అందుకే అవసరం ఉన్నా, లేకపోయినా ఏదో ఒక వ్యాఖ్య చేసి సోషల్ మీడియాలో తమని తాము టార్గెట్ చేసుకుంటున్నారు. ఇక కొందరైతే నోటి దురద కొద్దీ ఏదో ఒకటి మాట్లాడి అభాసు పాలవుతున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితే వచ్చిన తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్‌కి. నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసి అందరి చేతా తిట్టించుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న త్రిష కూడా మన్సూర్‌కి కావాల్సినంత పెట్టింది.
అసలేం జరిగిదంటే... విజయ్, త్రిష కాంబినేషన్‌లో వచ్చిన మూవీ ‘లియో’లో మన్సూర్ అలీఖాన్ ఓ పాత్ర పోషించాడు. సినిమా హిట్ అయిన నేపథ్యంలో మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా మన్సూర్ మాట్లాడుతూ ‘‘నేను త్రిషతో నటిస్తున్నానని విన్నప్పుడు, సినిమాలో బెడ్‌రూం సన్నివేశం ఉంటుందని అనుకున్నా. ఆమెను చేతులతో ఎత్తుకుని బెడ్‌రూంలోకి తీసుకెళ్లొచ్చని భావించాను. నేను గతంలో చాలా సార్లు రేప్ సీన్లు చేశాను. ఇది నాకు కొత్తకాదు. అయితే, లియో కశ్మీర్ షెడ్యూల్ సెట్స్‌లో త్రిషను నాకు చూపించనే లేదు’’ అంటూ త్రిష గురించి ఎంతో నీచంగా మాట్లాడాడు.
దీనిపై త్రిష ఘాటుగానే సమాధానమిచ్చింది. ‘‘మన్సూర్ అలీ ఖాన్ నాపై చెత్త వ్యాఖ్యలు చేసిన వీడియో ఒకటి నా దృష్టికి వచ్చింది. నేను అతడి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నా. అతడి కామెంట్స్‌లో స్త్రీలపై వివక్ష, ద్వేషం, పురుష దురహంకారం కనిపిస్తున్నాయి. ఇలాంటి చెత్త వ్యక్తితో ఎప్పటికీ నటించను’’ అని పోస్ట్ చేసింది.
![]() |
![]() |