![]() |
![]() |

కొంత మంది పుణ్యమా అని ఒక వ్యక్తి ఎంత సాధించినా కూడా ఆ వ్యక్తి గురించి ప్రస్తావించుకోవలసి వస్తే మనం ఇంకో వ్యక్తి గురించి చెప్పుకోవలసి వస్తుంది.ఇప్పుడు మనం చెప్పుకోబోయే నటుడుది కూడా అదే పరిస్థితి. రక్షిత్ శెట్టి సినిమా రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నప్పటికీ రక్షిత్ శెట్టి మాత్రం రష్మిక మందన్నా మాజీ లవర్ అనే హోదాలో ఉన్నాడు. లేటెస్ట్ గా తన ఫస్ట్ లవ్ విషయంలో తనకి జరిగిన అన్యాయాన్ని చెప్పి సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచాడు.
రక్షిత్ శెట్టి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి రోజు కాలేజీ కి బస్సు లో వచ్చేది. కానీ హాస్టల్ లో ఉండే రక్షిత్ ఆ అమ్మాయితో పాటు రోజు బస్సు లో వచ్చే తన ఫ్రెండ్ కి ఒక లెటర్ ఇచ్చి తను ఇష్టపడే అమ్మాయికి ఇవ్వమని చెప్పేవాడు. ఇలా రెండు సంవత్సరాల దాకా రక్షిత్ తన ఫ్రెండ్ ద్వారా ఆ అమ్మాయికి తన ప్రేమని వ్యక్తం చేస్తు లెటర్స్ రాసి పంపించేవాడు. కానీ ఏ రోజు కూడా ఆ అమ్మాయి రక్షిత్ వైపు చూసేది కాదు. ఆ తరవాత రక్షిత్ కి తెలిసిన నిజం ఏంటంటే రక్షిత్ రాసి ఇచ్చిన ఒక్కలెటర్ ని కూడా తన ఫ్రెండ్ ఆ అమ్మాయికి ఇవ్వలేదు. పైగా ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే రక్షిత్ ప్రేమించిన అమ్మాయి, రక్షిత్ ఫ్రెండ్ లు పెళ్లి కూడా చేసుకున్నారు.
ఇపుడు రక్షిత్ శెట్టి చెప్పిన ఈ విషయాన్ని చూసిన చాలా మంది హిందీలో సల్మాన్ ఖాన్ చేసిన బాడీ గార్డ్ సినిమాని గుర్తు చేసుకుంటున్నారు. ఇదే సినిమా అదే పేరుతో వెంకటేష్ హీరోగా తెలుగులో కూడా వచ్చింది. కాకపోతే ఇందులో వెంకటేష్ ని ఇష్టపడిన త్రిష వెంకటేష్ కి తనెవరో తెలియకుండా రకరకాల మార్గాల్లో తన ప్రేమని వ్యక్తపరుస్తు ఉంటే నేనే నిన్ను ప్రేమిస్తుందని త్రిష ఫ్రెండ్ సలోని వెంకటేష్ ని పెళ్లిచేసుకుంటుంది. రక్షిత్ శెట్టి ప్రస్తుతం సప్తసాగరాలు దాటి సైడ్ బి సినిమాకి సంబందించిన ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్నాడు. నవంబర్ 17 న ఈ సినిమా విడుదల కానుంది.
![]() |
![]() |