![]() |
![]() |

మెగా ఇంట దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. రామ్ చరణ్-ఉపాసన దంపతులు ఇచ్చిన పార్టీకి మెగా కుటుంబంతో పాటు, సినీ పరిశ్రమకు చెందిన ఎందరో హాజరయ్యారు. అయితే ఓ వైపు మెగా ఇంట దీపావళి సెలెబ్రేషన్స్ ఇంత ఘనంగా జరిగితే, మరోవైపు మెగాస్టార్ మనవరాలు మాత్రం ఎలాంటి హడావుడి లేకుండా తన తండ్రితో కలిసి సింపుల్ గా దీపావళి జరుపుకుంది.
చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ, ఆమె భర్త కళ్యాణ్ దేవ్ కొంతకాలంగా దూరంగా ఉంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలకు బలం చేకూరుస్తూ కళ్యాణ్ దేవ్ కూడా మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడు. మెగా ఇంట జరిగే ఏ వేడుకులకు ఆయన హాజరు కావడంలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు.. మెగా అభిమానులు ఎమోషనల్ అయ్యేలా ఉన్నాయి.

తన కూతురు నవిష్కతో కలిసి దీపావళి జరుపుకున్న ఫొటోలను కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఒక ఫొటోలో కళ్యాణ్ దీపాలు వెలిగిస్తుండగా, నవిష్క పక్కనే కూర్చొని గమనిస్తుంది. మరో రెండు ఫొటోల్లో తండ్రి ఒడిలో కూర్చొని ముద్దుగా ఉంది.

తల్లి శ్రీజ దగ్గరే పెరుగుతున్న నవిష్క అప్పుడప్పుడు తండ్రి దగ్గరకు వెళ్తున్నట్టు సమాచారం. అలా దీపావళి పండుగ సందర్భంగా తండ్రి వద్దకు వెళ్ళింది. అయితే తండ్రితో కలిసి పండుగ సెలెబ్రేట్ చేసుకుంటున్నప్పటికీ.. పక్కన తల్లి, ఇతర కుటుంబ సభ్యులు లేరనే బాధ ఆ పాప కళ్ళలో కనిపిస్తోంది. దీంతో మెగాస్టార్ మనవరాలికి ఎంత కష్టమొచ్చింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ దర్శనమిస్తున్నాయి.
![]() |
![]() |