![]() |
![]() |

కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం కంగువా. ఈ మూవీ కోసం భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం ఎదురుచూస్తూ ఉందంటే కంగువా కి ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ ఎలాంటిందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన నయా అప్ డేట్ ఒకటి బయటకి వచ్చింది. దీంతో సూర్య ఫాన్స్ లో మంచి జోష్ కనపడుతుంది
సూర్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జట్ తో తెరకెక్కుతున్న మూవీ కంగువా. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 11 న విడుదల కాబోతుంది. ఈ మేరకు మూవీ మేకర్స్ నుంచి అధికార ప్రకటన రాకపోయినా కూడా కంగువా మూవీ ఏప్రిల్ 11 న రావడం మాత్రం ఖాయమనే మాట తమిళ చిత్రసీమలో వినబడుతుంది. ఈ మధ్యనే రిలీజ్ అయిన కంగువా ఫస్ట్ లుక్ టీజర్ రికార్డు స్థాయిలో వ్యూయర్స్ ని సంపాదించింది. అలాగే టీజర్ లో సూర్య నటనని చూసిన ఫ్యాన్స్ అయితే కంగువాలో మా సూర్య నట విశ్వరూపం చూడబోతున్నామనే ఆనందంతో ఉన్నారు. ఇప్పుడు ఏప్రిల్ 11 వ తేదీ కోసం సూర్య ఫ్యాన్స్ఈ రోజు నుంచే కౌంట్ డౌన్ ప్రారంబిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.
వరల్డ్ వైడ్ గా 10 భాషల్లో 3డి స్థాయిలో రిలీజ్ కాబోతున్న కంగువా మూవీ ని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలైన యూవీ క్రియేషన్స్ , గ్రీన్ స్టూడియో లు నిర్మిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ మూవీ కి గోపీచంద్ తో శంఖం, శౌర్యం, రవితేజ తో దరువు, అలాగే తమిళం లో అజిత్ తో వేదాళం, వివేగం, వీరం, విశ్వాసం లాంటి చిత్రాలని తెరకెక్కించిన శివ దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు.
![]() |
![]() |