![]() |
![]() |

ఎన్నో చిత్రాల్లో అద్భుతంగా నటించి ఆయా పాత్రలకి ప్రాణం పోసిన నటులు చంద్రమోహన్. ఆయన సినీ ప్రస్థానం ఒకటి కాదు రెండు కాదు 50 సంవత్సరాలకి పైనే. హీరోగా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ,కమెడియన్ గా ఆయన సాగించిన సినీ ప్రయాణం తెలుగు వాళ్లందరికీ సుపరిచితమే. తనకి మాత్రమే సాధ్యమయ్యే నటనతో ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్న ఆయన నేడు పరమపదించారు.
ఈ రోజు ఉదయం హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో 9.45 గంటలకు హృద్రోగంతో కన్ను మూశారు. ప్రస్తుతం ఆయన వయసు 82 ఏళ్ళు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. చంద్ర మోహన్ గారి మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
![]() |
![]() |