![]() |
![]() |
.webp)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అండ్ క్రేజీ డైరెక్టర్ సుకుమార్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటింగ్ మూవీ పుష్ప 2 . పుష్ప పార్ట్ 1 లో బన్నీ మ్యాజిక్ ని చూసిన ప్రేక్షకులు ఇప్పుడు పుష్ప 2 లో బన్నీ మ్యాజిక్ ఏ విధంగా ఉండబోతుందో అని పాన్ ఇండియా వైడ్ గా మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక వార్త హల్ చల్ చేస్తుంది.
పుష్ప 2 సినిమాలో సుకుమార్ చిత్రీకరిస్తున్న ఒక ఎపిసోడ్ గురించి ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చర్చ నడుస్తుంది. ఒక జాతరకి సంబంధించి తీసిన ఆ ఎపిసోడ్ లో జాతరతో పాటుగా ఒక భారీ యాక్షన్ అండ్ సాంగ్ సీక్వెన్స్ ని కూడా సుకుమార్ కంప్లీట్ చేసాడనే వార్తలు వస్తున్నాయి. అలాగే ఆ ఎపిసోడ్ సినిమాలోనే హైలెట్ కాబోతుందని అవుట్ ఫుట్ కూడా సాలిడ్ గా వచ్చిందని అంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ న్యూస్ అల్లు అర్జున్ అభిమానులకి గుడ్ న్యూస్ అని అనుకోవచ్చు.
పుష్ప సాధించిన ఘన విజయం నేపథ్యంలో పుష్ప 2 సినిమా మీద అల్లు అర్జున్ అభిమానుల్లోను సినీ ప్రేక్షకుల్లోను భారీ అంచనాలే ఉన్నాయి. పుష్ప సినిమాలో ప్రదర్శించిన నటనకి గానే బన్నీ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ని అందుకున్న నేపథ్యంలో ఇప్పుడు పుష్ప 2 లో ఏ విధంగా నటించాడనే ఉత్సుకత ప్రేక్షకుల్లో ఉంది. బన్నీ అభిమానులైతే పుష్ప 2 లో మా బన్నీ విశ్వరూపం ఒక రేంజ్ లో ఉండబోతుందని అంటున్నారు.
![]() |
![]() |