![]() |
![]() |
గత రెండు రోజులుగా రష్మిక ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ వీడియో రిలీజ్‌పై ఎంతో మంది ప్రముఖులు స్పందించడం, రష్మికకు మద్దతు తెలపడం మనం చూస్తున్నాం. సినీ ప్రముఖులే కాదు, రాజకీయ నాయకులు సైతం ఈ వీడియోను ఖండిస్తూ బాధ్యులను శిక్షించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించాడు. ‘భవిష్యత్తులో మరో మహిళకు ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి దారుణాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలి. దీనికోసం ప్రత్యేక సైబర్ విభాగాన్ని ఏర్పాటు చేయాలి. అప్పుడే మహిళలకు రక్షణ ఉంటుంది’ అని పోస్ట్ చేశారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండిరచింది. సినీతారలను ఇలాంటి వీడియోలతో అగౌరవపరచడం సరైంది కాదని, ఇలాంటి వీడియోలను అందరూ వైరల్ చేయడం కూడా చాలా తప్పు అని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ‘కన్నప్ప’ షూటింగ్ నిమిత్తం న్యూజిలాండ్‌లో ఉన్న విష్ణు.. రష్మిక ఫేక్ వీడియో గురించి తెలుసుకొని సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘రష్మిక మందన్నకు నా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను. ఫేక్ వీడియో తరహా ఘటనలను ‘మా’ సహించబోదు. దీనికి కారణమైన వారిని శిక్షించే వరకు ‘మా’ పోరాటం చేస్తుంది. దీనికోసం లీగల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులతో కలసి అవసరమైన మార్గదర్శకాలను రూపొందించడంలో ‘మా’ సహకారం అందిస్తుంది. నటీనటుల గౌరవాన్ని కాపాడడానికి ‘మా’ కృషి చేస్తుంది’ అని పేర్కొన్నారు.
![]() |
![]() |