![]() |
![]() |

కొందరు హీరోయిన్లు అవకాశాల కోసం ఎదురుచూస్తుంటే.. యంగ్ బ్యూటీ శ్రీలీల మాత్రం వచ్చిన అవకాశాలను వదులుకుంటోంది. అందుకు కారణం.. డేట్లు సర్దుబాటు కాకపోవడమే. రీసెంట్ గా 'భగవంత్ కేసరి'తో ఘన విజయాన్ని అందుకున్న శ్రీలీల చేతిలో ప్రస్తుతం 'ఆదికేశవ', 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్', 'గుంటూరు కారం', 'VD12', 'ఉస్తాద్ భగత్ సింగ్' వంటి సినిమాలు ఉన్నాయి. అయితే వీటిలో 'VD12' నుంచి శ్రీలీల తప్పుకున్నట్లు తెలుస్తోంది.
విజయ్ దేవరకొండ తన 12వ సినిమాని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్. అయితే ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవ్వడంతో.. శ్రీలీల కమిట్ అయిన ఇతర సినిమాల డేట్స్ క్లాష్ అవుతున్నాయట. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ నుంచి శ్రీలీల తప్పుకోవాలి నిర్ణయించుకున్నట్లు సమాచారం. శ్రీలీల స్థానంలో 'ఏజెంట్' ఫేమ్ సాక్షి వైద్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనుందని తెలుస్తోంది.
![]() |
![]() |