![]() |
![]() |

తారాగణం: కార్తీక్ రత్నమ్, సుప్యర్థ సింగ్, ఉత్తేజ్, తాగుబోతు రమేష్ తదితరులు
సంగీతం: బికాజ్ రాజ్
రచన, దర్శకత్వం: ఆనంద్ బడా
నిర్మాత: యాదగిరి రాజు
బ్యానర్: శ్రీకళ ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేదీ: అక్టోబర్ 27, 2023
'కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ కార్తీక్ రత్నం హీరోగా నటించిన తాజా చిత్రం 'లింగొచ్చా'. 'అర్ధ శతాబ్దం', 'నారప్ప' వంటి ఓటీటీ సినిమాలతో ఆకట్టుకున్న కార్తీక్.. థియేటర్లలో సోలో హీరోగా హిట్ కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల 'ఛాంగురే బంగారు రాజా' అనే సినిమాలో ప్రేక్షకుల ముందుకు రాగా, అది నిరాశపరిచింది. ఇప్పుడు 'లింగొచ్చా' చిత్రంతో పలకరించాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? కార్తీక్ కి విజయాన్ని అందించేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
శివ (కార్తీక్ రత్నం) హైదరాబాద్ పాతబస్తీ లో నాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుర్రాడు. కటింగ్ చేయటంలో బాగా పేరుగాంచిన శివ చిన్నప్పుడే తన స్నీహితులతో కలసి లింగొచ్చా(ఏడు పెంకులాట) ఆడుతుంటే నూర్జహ (సుప్యర్థ సింగ్) ని చూసి ప్రేమలో పడతాడు. రోజురోజుకి ఆమె మీద ప్రేమని పెంచుకుంటూ ఉంటాడు. ఇంతలో నూర్జహని వాళ్ళ తల్లితండ్రులు దుబాయ్ కి పంపిస్తారు. ఆ విషయం తెలియక శివ ప్రతిరోజూ నూర్జహ ఇంటి చుట్టూ . చిన్నప్పుడు దుబాయ్ కి వెళ్ళిన నూర్జహ పెద్దయ్యాక మెడికల్ స్టూడెంట్ గా హైదరాబాద్ కి వస్తుంది. అయితే శివ తన స్నేహితులు సలహలు పాటించి నూర్జహ దగ్గర ఫూల్ అవుతూ వుంటాడు. అయితే ఎట్టకేలకు శివ మనసు తెలుసుకున్న నూర్జహ తన ప్రేమని చెప్తుంది. కానీ వీళ్ళిద్దరి ప్రేమ విషయం గురించి, నూర్జహ తండ్రి ఆమెకి వేరే పెళ్ళి సంబంధం చూస్తాడు. ఆ విషయాన్ని శివకి చెప్పి దుబాయ్ వెళ్ళిపోదామని చెప్తుంది నూర్జహ. శివ నూర్జహ చెప్పింది అంగీకిరించి.. ముందుగా నూర్జహని దుబాయ్ పంపిస్తాడు. తరువాత శివ తన పేరెంట్స్ ని, ఫ్రెండ్స్ ని వదిలి నూర్జహ కోసం దుబాయ్ వెళ్ళాడా?. సింగిల్ గా వెళ్ళిన నూర్జహ దుబాయ్ లో ఏం చేసింది?. శివ, నూర్జహ ప్రేమకథ ఎలాంటి మలుపు తిరిగింది?. వీళ్ళు కలుసుకున్నారా లేదా? అనేది మిగిలిన కథ.
టెక్నికల్:
దర్శకుడు ఆనంద్ బడా తీసుకున్న నేపథ్యం మెచ్చుకోవాలి. హైదరాబాద్ నేటివిటి స్టొరీస్ వచ్చి చాలా కాలమైంది. లవ్ స్టోరిని చెప్పే విధానంలో దర్శకుడు పాసయ్యాడు. అలాగే నటీనటుల నుంచి మంచి నటన రాబట్టుకున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ బికాజ్ రాజ్ మంచి సంగీతాన్ని అందించాడు. ఎడిటింగ్ పర్వాలేదనిపించింది. సెకండాఫ్ లో ఇంకా ట్రిమ్ చేయొచ్చు. కెమెరామెన్ పనితనం బాగుంది. హైదరాబాద్ పాతబస్తీలో లొకేషన్స్ ని అందంగా చూపించాడు. ఆర్ట్ వర్క్ కూడా బాగుంది. డైలాగ్స్ కూడా మెప్పించాయి.
నటీనటులు:
కార్తిక్ రత్నం థియేటర్ ఆర్టిస్ట్ కావడం వలన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. నటనతో కట్టిపడేశాడు. హీరోయిన్ సుప్యర్థ సింగి కూడా చక్కగా రాణించింది. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. తాగుబోతు రమేష్, ఉత్తేజ్ లు స్టోరి నేరేటర్స్ గా మెప్పించారు. మిగతా నటీనటులు వారి పాత్రల పరిధిలో మెప్పించే ప్రయత్నం చేశారు.
ప్లస్ పాయింట్స్:
కార్తీక్ రత్నం
హైదరాబాద్ నేటివిటి
సంగీతం
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్:
లౌడ్ కామెడీ
సెకండాఫ్ లో సాగదీత
తెలుగువన్ పర్‌స్పెక్టివ్:
హైదరాబాది నవాబ్స్, అంగ్రేజ్ లాంటి చిత్రాలు లోకల్ లో సంచలన విజయాలు సాధించిన చాలా సంవత్సరాలు తరువాత లోకల్ గా లింగొచ్చా వచ్చింది. హైదరాబాదీలు చూడదగ్గ చిత్రం. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే.. హైదరాబాద్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ హిందూ-ముస్లిం ప్రేమకథ బాగానే అలరిస్తుంది.
రేటింగ్: 2.5/5
![]() |
![]() |