![]() |
![]() |

.దళపతి విజయ్ హీరో గా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లియో.. విజయ దశమి ని పురస్కరించుకొని తెలుగు ,తమిళ,కన్నడ ,మలయాళ, హింది బాషలలో రిలీజ్ అయిన లియో అన్ని చోట్ల మంచి వసూళ్లు రాబడుతూ ముందుకు దూసుకెళుతుంది. వరుస సెలవలు కూడా కావడం కూడా లియో మూవీ కి బాగా కలసివచ్చింది .ఈ చిత్రం విజయవంతమైన సందర్బాన్ని పురస్కరించుకొని చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ లియో ప్రమోషన్స్ లో పాల్గొనటానికి కేరళ వెళ్ళాడు. అక్కడ జరిగిన ఒక సంఘటనతో లోకేష్ చెన్నై కి బయలుదేరాడు.
లోకేష్ కనగరాజ్ ఎంతటి విభిమన్నమైన దర్శకుడో ఆయన నుండి వచ్చిన ఖైది, విక్రం ,మాస్టర్ సినిమాలే అందుకు ఉదాహరణ. లేటెస్ట్ గా తన దర్శకత్వం లో తాజాగా వచ్చిన లియో మూవీ ప్రమోషన్స్ కోసం లోకేష్ కేరళ వెళ్ళాడు. ముందుగా ఏర్పాటు చేసుకున్న టూర్ లో భాగంగా పాలక్కడ్ లోని లియో మూవీ ఆడుతున్న ఆరోమ ధియేటర్ కి ప్రమోషన్స్ కోసం లోకేష్ వెళ్ళడం జరిగింది. లోకేష్ వస్తున్నాడని ముందు నుండి ఉన్న ప్రచారం వల్ల పబ్లిక్ భారీగానే తరలివచ్చారు. ధియేటర్ సిబ్బంది కూడా అందుకు తగ్గట్టే బందోబస్తుని కూడా ఏర్పాటు చేసింది కాని ఆడియన్స్ ఒకే సారి నెట్టుకు రావటం తో లోకేష్ కాలి కి గాయం అయ్యింది .దీంతో తీవ్ర నొప్పితో బాధపడతున్న ఆయన కేరళలో జరగవలసిన తన లియో ప్రమోషన్స్ అన్నింటిని కాన్సిల్ చేసుకొని చెన్నై వెళ్ళాడు. మళ్ళీ తిరిగి ఎప్పుడు లియో ప్రమోషన్స్ జరిపేది లోకేష్ తెలియచేస్తా అన్నాడు.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వం లో విజయ్ హీరో గా దసరాకి వచ్చిన లియో సినిమా మిశ్రమ టాక్ తో ముందుకు వెళ్తూ ఉంది. రిలీజ్ అయిన అన్ని భాషల్లో కూడా విజయ్ నటన బాగున్నా లోకేష్ గత చిత్రాల లెవెల్లో సినిమా లేదనే టాక్ అయితే వినపడుతుంది. కానీ టాక్ తో సంబంధం లేకుండా లియో రికార్డు కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతున్నాడు.
![]() |
![]() |