![]() |
![]() |

తెలుగు సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ అనే పేరు వినపడితేనే చాలు తెలుగు సినిమా కలెక్షన్ లు వేగంతో పరుగెడుతుంటాయి. పవన్ సినిమా విడుదల రోజున పవన్ సినిమా ఎలా ఉందని ఎంక్వయిరీ చేసే సాధారణ ప్రజలు కూడా చాలా మందే ఉంటారు. పవన్ నుంచి ఇప్పటివరకు సుమారు 26 సినిమాలు దాకా వచ్చాయి. పవన్ లేట్ గా సినిమా లు చేసుండచ్చు గాని పవన్ షూటింగ్ స్టార్ట్ చేసిన సినిమా మాత్రం ఎప్పుడు లేటు అవ్వలేదు.కానీ ఒక్క సినిమా మాత్రం దసరా పండక్కి పవన్ అభిమానులకి షాక్ ఇచ్చింది.
విజయదశమిని పురస్కరించుకొని చాలా మంది సినీ మేకర్స్ ఆయుధ పూజ పేరుతో సలాది పోస్టర్ అంటూ తమ ప్రొడక్షన్ నుంచి రాబోయే సినిమా పోస్టర్ ని రిలీజ్ చేస్తారు. అలా చాలా సినిమా కంపెనీ లు తమ న్యూ ప్రోడక్ట్ కి సంబంధించిన సలాది పోస్టర్ ని దసరా కానుకగా రిలీజ్ చేసారు. వాటిల్లో పవన్ నుంచి రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మరియు ఓ.జి సినిమాల సలాది పోస్టర్స్ ఉన్నాయి. కానీ ఓ.జి ,ఉస్తాద్ ల కంటే ముందే మొదలైన హరి హర వీరమల్లు సలాది పోస్టర్ మాత్రం లేదు.దీంతో ఒక్కసారిగా పవన్ ఫాన్స్ షాక్ అయ్యారు.
పవన్ కళ్యాణ్ హీరో గా క్రిష్ దర్శకత్వంలో ఏ ఎం రత్నం నిర్మాతగా రెండు సంవత్సరాల క్రితం హరిహరవీరమల్లు చిత్రం ప్రారంభం అయ్యింది. మరి ఈ చిత్రం ఏ ముహూర్తాన మొదలయ్యిందో గాని సినిమా ఒక పట్టాన కంటిన్యూగా పట్టాలెక్కడం లేదు. ఇప్పటికే సగభాగం షూటింగ్ జరుపుకున్న వీరమల్లు ఏదో ఒక రకంగా వాయిదా పడుతూనే వస్తుంది. ఆల్రెడీ హరి హర వీర మల్లు షూటింగ్ సగభాగం పూర్తయ్యింది. మరి మిగతా సాగ భాగానికి మోక్షం ఎప్పుడు కలుగుతుందని పవన్ ఫాన్స్ అండ్ సినీ ఫాన్స్ అంటున్నారు. వీరమల్లు మొదటి సారి వాయిదా పాడినప్పుడు క్రిష్ ఆ గ్యాప్ లో కొండపోలం లాంటి అతి తక్కువ రోజుల్లో పూర్తయే సినిమా కి దర్శకత్వం వహించాడు. ఇప్పుడు క్రిష్ కూడా ఎక్కడ ఎలాంటి కొత్త సినిమా కి పనిచెయ్యడం లేదు అలాగే హరి హర వీర మల్లు గురించి ఎక్కడ మాట్లాడటం లేదు. దసరా రోజున అయిన సినిమా కి సంబంధించిన ఏదో ఒక న్యూసో లేక పోస్టరో రిలీజ్ చేస్తే బాగుండేదని పవన్ ఫాన్స్ అనుకుంటున్నారు.
![]() |
![]() |