![]() |
![]() |

మెగా కుటుంబంలో పెళ్లి సందడి మొదలయింది. ఇటీవలే వరుణ్,లావణ్యల నిశ్చితార్థం అత్యంత వైభవంగా జరగడం తో పాటు ఆల్రెడీ ఫ్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి.నెక్స్ట్ మంత్ ఇటలీలో మెగా కుటుంబ సభ్యులతో పాటు కొంత మంది సన్నిహితుల మధ్య వరుణ్,లావణ్య ల పెళ్లి ఇటలీలో జరగనుంది.ఇప్పుడు వరుణ్,లావణ్య ల పెళ్లి మెగా అభిమానుల్లో కొత్త టెన్షన్ కి దారితీసింది.
వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి ల పెళ్లి నెక్స్ట్ మంత్ ఇటలీలోని ఒక ఖరీదైన రిసార్ట్ లో జరగనుంది. ఆల్రెడీ అందరికి టికెట్స్ కూడా బుక్ అయ్యాయి. పెళ్లి రోజు కంటే కొన్ని రోజుల ముందే మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీ వెళ్లి వరుణ్,లావణ్య ల పెళ్లి ధూమ్ ధామ్ గా జరిపించడానికి సన్నాహాలు చేస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా కొన్ని వేడుకలు ఇటలీలోనే జరగనున్నాయి. అప్పటి దాకా మెగా ఫామిలీ మొత్తం ఇటలీ లోనే ఉంటున్నారు. కాకపోతే ఇప్పుడు మెగా అభిమానుల్లో టెన్షన్ ఏర్పడటానికి కారణం ఏంటంటే వరుణ్ ,లావణ్య ల పెళ్ళికి రాజకీయాల్లో బిజీ గా ఉన్న వరుణ్ బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అబ్బాయి పెళ్ళికి వెళ్తాడా లేదా అని మెగా అభిమానులలో చిన్న టెన్షన్ ఉంది.

వరుణ్ పెళ్లి తర్వాతే తన కొత్త సినిమా రిలీజ్ ప్రమోషన్స్ అండ్ కొత్త మూవీ షూటింగ్ లో పాల్గొంటాడు. వాస్తవానికి వరుణ్ నటిస్తున్న కొత్త సినిమా మట్కా షూటింగ్ గత నెలలోనే ప్రారంభం కావలసింది. కానీ వరుణ్ పెళ్లి వల్ల చిత్ర యూనిట్ తమ షెడ్యూలని క్యాన్సిల్ చేసుకుంది. వరుణ్, లావణ్యలు తమ హనీమూన్ ని ఇటలీ తో పాటు యూరప్ కంట్రీ ల్లోనే జరుపుకుంటున్నారు.
![]() |
![]() |