![]() |
![]() |
ఈ క్రిస్మస్‌కి ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ మధ్య పోరు జరగబోతోంది. ఆ ఇద్దరు హీరోలు ఎవరో కాదు, ప్రభాస్, షారూక్ ఖాన్. ప్రభాస్ ‘సలార్’తో, షారూక్ ‘డుంకీ’తో రంగంలోకి దిగుతున్నారు. ఈ రెండు సినిమాలు ఒకేరోజు డిసెంబర్ 22న విడుదల కాబోతున్నాయి. దీంతో ఈ ఇద్దరు స్టార్‌ల ఫ్యాన్స్ ఎంతో ఎక్సైట్ అవుతున్నారు.
సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన ‘సలార్’ కొన్ని కారణాల వల్ల డిసెంబర్ 22కి వాయిదా పడిరది. అప్పటికే షారూక్ ఖాన్ ‘డుంకీ’ చిత్రం రిలీజ్‌కి డేట్ పిక్స్ చేసేశారు. అయితే ‘డుంకీ’ రిలీజ్‌ని వాయిదా వేయబోతున్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. వర్క్ చాలా పెండిరగ్‌లో ఉందని, ఈ సంవత్సరం వచ్చే అవకాశం తక్కువ అని ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి టీజర్ కూడా రిలీజ్ చేయకపోవడంతో ఆ వార్త నిజమే అనుకున్నారు.
ఇదిలా ఉంటే ‘డుంకీ’ రిలీజ్ వాయిదా పడిరదనే వార్తలో నిజం లేదని తెలుస్తోంది. డిసెంబర్ 22నే ‘డుంకీ’ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా గురించి వస్తున్న వార్తలను నమ్మవద్దని బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. షారుఖ్ నటించిన జవాన్ ప్రస్తుతం థియేటర్స్‌లో ఉంది. కాబట్టి డుంకి అప్‌డేట్ ఆలస్యం అవుతోంది. అంతే తప్ప సినిమా రిలీజ్‌లో ఎలాంటి మార్పు లేదని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాబట్టి, ఈ క్రిస్మస్‌కి సలార్, డుంకీ మధ్య భారీ పోటీ వుంటుందని తెలుస్తోంది. మరి ప్రభాస్, షారూక్‌లలో ఎవరు బాక్సాఫీస్ బాద్‌షా అవుతారో చూడాలి.
![]() |
![]() |