![]() |
![]() |

సంక్రాంతి పండగ తెలుగు సినిమాలకు అదిరిపోయే సీజన్. అందుకే మేకర్స్ తమ సినిమాని సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఏమాత్రం ఉన్నా అసలు మిస్ చేసుకోవాలనుకోరు. అదే ఇప్పుడు 2024 సంక్రాంతి పోరుని రసవత్తరంగా మారుస్తోంది. ఇప్పటికే సంక్రాంతి సీజన్ పై ఐదు సినిమాలు కర్చీఫ్ వేయగా.. తాజాగా మరో రెండు సినిమాలు రేసులోకి వచ్చేలా ఉన్నాయి.
2024 సంక్రాంతికి వస్తున్నట్లు ఇప్పటికే 'గుంటూరు కారం', 'హనుమాన్', 'ఈగల్', 'VD13'(విజయ్ దేవరకొండ-పరశురామ్ మూవీ), 'నా సామి రంగ' మూవీ టీమ్స్ ప్రకటించాయి. వీటికే థియేటర్ల సమస్య వస్తుందేమో అనుకుంటుంటే.. ఇప్పుడు బరిలో 'సైంధవ్', 'హాయ్ నాన్న' సినిమాలు కూడా నిలిచేలా ఉన్నాయి.
నిజానికి ఈ డిసెంబర్ 21న 'హాయ్ నాన్న', డిసెంబర్ 22న 'సైంధవ్' విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు డిసెంబర్ 22 పై 'సలార్' కన్నేయడంతో.. ఈ రెండు సినిమాలు విడుదల తేదీని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 'సైంధవ్' టీమ్ ఇప్పటికే సంక్రాంతికి రావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 'హాయ్ నాన్న' టీమ్ మాత్రం రెండు డేట్స్ ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి రేస్ నుంచి ఒక సినిమా తప్పుకుంటే సంక్రాంతికి రావాలని, లేదంటే డిసెంబర్ 7 కే వచ్చేయాలని చూస్తున్నారట. ప్రస్తుతం సంక్రాంతి రేసులో ఉన్న వాటిలో 'VD13' వాయిదా పడే అవకాశముంది అంటున్నారు. ఆ సినిమా వాయిదా పడితే మాత్రం 'హాయ్ నాన్న' కూడా సంక్రాంతి బరిలో నిలిచినట్లే.
![]() |
![]() |