![]() |
![]() |
నవీన్‌చంద్ర, స్వాతిరెడ్డి జంటగా శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మంత్ ఆఫ్ మధు’. ఈ చిత్రాన్ని యశ్వంత్ ములుకుట్ల నిర్మించారు. అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ సెప్టెంబర్ 26న జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో సాయిధరమ్‌తేజ్ ట్రైలర్‌ను విడుదల చేసి యూనిట్‌కి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంలో హీరోయిన్ స్వాతి గురించి ప్రత్యేకంగా చెప్పాడు సాయిదరమ్. ‘మొదట కలర్స్ స్వాతి, ఆ తర్వాత స్వాతిగా, ఆ తర్వాత స్వాతిగాడు... స్వాతి పేరు మారుతూ వచ్చింది. నాకు మంచి స్నేహితురాలు స్వాతి. ఈ సినిమా తప్పకుండా ఆమెకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్’ అని చెప్పగానే సాయిధరమ్ బుగ్గపై ముద్దు పెట్టింది స్వాతి. కాసేపటి తర్వాత అతని బుగ్గపై లిప్‌స్టిక్ అంటుకుందని గమనించిన స్వాతి వెంటనే తన చేతితో చెరిపేసింది. ఎంతో ఆప్యాయంగా సాయిధరమ్‌కి పెట్టిన ముద్దు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ద్వారా ఇద్దరూ ఎంత మంచి స్నేహితులో అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
![]() |
![]() |