![]() |
![]() |

కిరణ్ అబ్బవరం హీరోగా పరిచయమైన 'రాజా వారు రాణి గారు' చిత్రంతో రవికిరణ్ కోలా దర్శకుడిగా పరిచయమయ్యాడు. 2019 లో విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల మెప్పు పొందడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తర్వాత కిరణ్ హీరోగా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంటే, రవికిరణ్ మాత్రం నాలుగేళ్లు అవుతున్నా దర్శకుడిగా తన రెండో సినిమా చేయలేదు. మధ్యలో 'అశోకవనంలో అర్జున కళ్యాణం' చిత్రానికి మాత్రం రచయితగా వ్యవహరించి ఆకట్టుకున్నాడు. అయితే ఎట్టకేలకు ఇన్నాళ్లకు దర్శకుడిగా రవికిరణ్ రెండో సినిమా ప్రకటన వచ్చింది. అది కూడా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో కావడం విశేషం.
చిన్న, మీడియం, భారీ బడ్జెట్ అనే తేడా లేకుండా వరుస సినిమాలు నిర్మిస్తున్న దిల్ రాజు.. తాజాగా తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రవికిరణ్ దర్శకత్వంలో ఓ సినిమాని ప్రకటించాడు. ఈ మూవీలో విజయ్ దేవరకొండ హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ రవికిరణ్ కూడా సోషల్ మీడియాలో 'Vicious Dynamite' అంటూ 'VD'(విజయ్ దేవరకొండ) పేరు వచ్చేలా హింట్ ఇచ్చాడు. అంతేకాదు ఇదొక గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ అని టాక్.

దిల్ రాజు నిర్మాణంలో విజయ్ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే పరశురామ్ డైరెక్షన్ లో ఓ సినిమా ప్రకటించాడు. ఇప్పుడు రవికిరణ్ దర్శకత్వంలో చేయనున్నాడు. అలాగే ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించనున్న భారీ బడ్జెట్ ఫిల్మ్ 'జటాయు'లో కూడా విజయ్ నటించే అవకాశముందని సమాచారం.
![]() |
![]() |