![]() |
![]() |

'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే దాదాపు సగం షూటింగ్ అయిపోయింది అంటున్నారు. అయితే ఇంత వేగంగా షూటింగ్ చేస్తే, క్వాలిటీ సంగతేంటి? అని పవన్ అభిమాని ట్విట్టర్ వేదికగా అనుమానం వ్యక్తం చేయగా.. హరీష్ శంకర్ అతనికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు.
"ఉస్తాద్ భగత్ సింగ్ 50 శాతం షూట్ కంప్లీట్ అంట కదన్నా. ఇంక క్వాలిటీ ఆ దేవుడు మీదే భారం వేశాం" అంటూ ఓ పవన్ అభిమాని హరీష్ ని ఉద్దేశించి కామెంట్ చేశాడు. దీనిపై స్పందించిన హరీష్.. "అంతే కదా తమ్ముడు.. అంతకుమించి నువ్వేమి చేయగలవు చెప్పు?.. ఈలోగా కాస్త కెరీర్, జాబ్, స్టడీస్ మీద ఫోకస్ పెట్టు.. వాటిని మాత్రం దేవుడికి వదిలేయకు.. ఆల్ ది బెస్ట్" అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో రిప్లై అదిరిపోయింది అన్న అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే మరో అభిమాని మాత్రం "మా కెరీర్ నాశనమైపోయినా పర్లేదు.. నువ్వు మాత్రం ఇంకో గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఇవ్వు అన్న" అని కామెంట్ చేయగా.. "బెస్ట్ ఇవ్వడానికి నేను నా వంతు ప్రయత్నం చేస్తాను బ్రదర్" అని హరీష్ రిప్లై ఇచ్చాడు.

![]() |
![]() |