
మహేష్ ఇంటికి ఓ గెస్ట్ రాకతో ఫ్యామిలీ అంతా ఆనందంలో మునిగి తేలుతున్నారు. సితారతో ఆడుకునేందుకు ఆ గెస్ట్ సిద్ధమైంది. ఆ గెస్ట్ ఓ కుక్కపిల్ల స్నూపీ. మహేష్ ఫ్యామిలీ ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న ప్లూటో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్లూటో స్థానాన్ని స్నూపీ భర్తీ చేసింది.
ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేస్తూ కొత్త అతిథి ఫోటోను షేర్ చేసింది నమ్రత. ‘నిన్ను ప్లూటో మా దగ్గరికి పంపించింది. ఒక కుక్కపిల్లను కోల్పోయామన్న బాధ ఓ పక్క, మరో వైపు కొత్త కుక్క పిల్లను పెంచుకోబోతున్నామనే సంతోషంతో నిన్ను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం స్నూపీ... నిన్ను మరింత ప్రేమిస్తాం’ అంటూ స్నూపీ ఫోటోను అందరికీ షేర్ చేసింది నమ్రత. అంతేకాదు, మహేష్ కుటుంబ సభ్యులతో స్నూపీ ఉన్న ఫోటోలను కూడా ఇన్‌స్టాలో షేర్ చేశారు.