![]() |
![]() |

సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి రమ్య(దివ్య స్పందన) కన్నుమూశారని ప్రచారం జరుగుతోంది. 40 ఏళ్ళ రమ్య గుండెపోటుతో ఈరోజు తుదిశ్వాస విడిచినట్లు సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని సన్నిహితల వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫేక్ ప్రచారం ఎవరి పని అని అభిమానులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రమ్య తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో నటించారు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'అభిమన్యు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. 'సూర్య సన్నాఫ్ కృష్ణన్'లో ప్రియగా తన నటనతో కట్టిపడేసారు. రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. ఎంపీగా పనిచేశారు.
![]() |
![]() |