
ఏమిటీ కన్‌ఫ్యూజన్ అనుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే జరుగుతున్న విషయాలు అలాంటివి. బాలీవుడ్‌లో ఎప్పటి నుంచో హీరోగా ఉంటూ ఇప్పటికీ హీరోగా పలు చిత్రాల్లో నటిస్తున్న సైఫ్ అలీఖాన్ ఇటీవల వచ్చిన ప్రభాస్ ‘ఆదిపురుష్’లో రావణాసురుడిగా నెగెటివ్ క్యారెక్టర్‌లో నటించిన విషయం తెలిసిందే. రావణాసురుడు అంటే విలన్. బాలీవుడ్ హీరో టాలీవుడ్‌లో విలన్‌గా నటించడం విశేషమే కదా. ఇప్పుడు అదే సైఫ్ అలీ ఖాన్ మరోసారి విలన్‌గా కనిపించబోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న ‘దేవర’ చిత్రంలో సైఫ్ విలన్ అనే విషయం తెలిసిన విషయమే.
మరి టాలీవుడ్‌లో టాప్ హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ బాలీవుడ్‌లో విలన్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా నటించడం విశేషం. ఆమధ్య వచ్చిన ‘వార్’ ఘనవిజయం సాధించింది. ఆ సినిమాలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించారు. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ‘వార్ 2’ రూపొందుతోంది. వార్ చిత్రానికి సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహించగా, వార్ 2 చిత్రాన్ని అయన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ విలన్ తన నట విశ్వరూపాన్ని చూపేందుకు సిద్ధమవుతున్నాడు. ఒక భాషలో హీరోగా పేరు తెచ్చుకున్నవారు మరో భాషలో విలన్‌గా నటించడం అనేది ప్రేక్షకులకు ఎంతో ఆసక్తిని కలిగించే అంశం. తమ అభిమాన హీరో విలన్‌గా ఎంతవరకు మెప్పించాడు అనేది చూసేందుకు ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు.