
మెగాస్టార్ చిరంజీవి ఇంట రక్షాబంధన్ పండగను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఇటీవల కాలి శస్త్రచికిత్స చేయించుకున్న చిరంజీవి ఈమధ్యకాలంలో ఎక్కడా బయట కనిపించలేదు. తన పుట్టినరోజు సందర్భంగా కూడా ఎలాంటి హడావిడీ లేదు. అయితే రక్షాబంధన్ సందర్భంగా తన ఇద్దరు చెల్లెళ్ళతో రాఖీ కట్టించుకున్నారు చిరంజీవి. దీనికి సంబంధించిన వీడియో తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు చిరంజీవి.
‘భోళాశంకర్’తో అపజయాన్ని చవిచూసిన చిరంజీవి. తన పుట్టినరోజు సందర్భంగా ఒకేసారి రెండు కొత్త సినిమాలకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను ఇచ్చారు. 156వ చిత్రంగా రూపొందనున్న చిత్రాన్ని కుమార్తె సుస్మిత నిర్మిస్తుండగా కళాణ్కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. 157వ సినిమాను యువి క్రియేషన్స్ పతాకంపై వశిష్ట్ దర్శకత్వంలో రూపొందనుంది. ఈ రెండు సినిమాలు త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనున్నాయి.