![]() |
![]() |

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటించిన చిత్రం 'బ్రో'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రానికి సముద్రఖని దర్శకుడు. 'వినోదయ సిత్తం' రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా జూలై 28న థియేటర్స్ లో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే ఓటీటీలో మాత్రం ఈ సినిమాకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
'బ్రో' చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ లో ఆగస్టు 25న విడుదలైంది. ఈ సినిమాకి కేవలం ఇండియాలోనే కాకుండా పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో కూడా విశేష ఆదరణ లభిస్తోంది. ఆగస్టు 21 నుంచి ఆగస్టు 27 వరకు నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 సినిమాల లిస్టులో ఇండియాలో బ్రో మూవీ మొదటి స్థానంలో నిలిచింది. అలాగే పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల్లో 8వ స్థానంలో నిలిచింది. ఓటీటీలో బ్రో సినిమాకి గ్లోబల్ రేంజ్ లో వస్తున్న రెస్పాన్స్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
![]() |
![]() |