![]() |
![]() |

కింగ్ నాగార్జునకి అచ్చొచ్చిన సంగీత దర్శకుల్లో స్వరవాణి కీరవాణిది ప్రత్యేక స్థానం. వీరి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్స్, చార్ట్ బస్టర్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ కాంబోలో వచ్చిన అన్నమయ్య ఆల్ టైమ్ క్లాసిక్ అయితే.. ఆ సినిమాకి ముందు వచ్చిన అంతం (ఒక పాట), ప్రెసిడెంటు గారి పెళ్ళాం, రక్షణ, వారసుడు, అల్లరి అల్లుడు, క్రిమినల్, ఘరానా బుల్లోడు.. తరువాత వచ్చిన సీతారామరాజు, బావ నచ్చాడు, ఆకాశ వీధిలో, నేనున్నాను, శ్రీరామదాసు, కృష్ణార్జున, రాజన్న, ఓం నమో వేంకటేశాయ మ్యూజికల్ గా ఎంతగానో అలరించాయి.
కట్ చేస్తే.. స్వల్ప విరామం అనంతరం ఈ క్రేజీ కాంబోలో మరో సినిమా వస్తోంది. అదే.. నా సామి రంగ. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్న ఈ ఊరమాస్ ఎంటర్టైనర్ కి సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ గ్లిమ్స్ ని నాగ్ బర్త్ డే స్పెషల్ గా మంగళవారం విడుదల చేశారు. ఇందులో "జాతర జాతర.. జా..జా.. జాతర" అంటూ వచ్చే కీరవాణి నేపథ్యసంగీతం నెక్స్ట్ లెవల్ లో ఉంది. చూస్తుంటే.. నాగ్, కీరవాణి కాంబోలో మరో సాలిడ్ మాస్ హిట్ రాబోతున్నట్టే అనిపిస్తోంది. కాగా, వచ్చే ఏడాది సంక్రాంతికి నా సామి రంగ జనం ముందుకు రానుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న నా సామి రంగకి బెజవాడ ప్రసన్నకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
![]() |
![]() |