![]() |
![]() |

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నుంచి సాలిడ్ హిట్ వచ్చి చాలా కాలమైంది. అప్పుడెప్పుడో 'గద్దలకొండ గణేశ్' గా ఆకట్టుకున్న వరుణ్.. ఆ తరువాత వచ్చిన 'గని', 'ఎఫ్ 3'తో భంగపడ్డాడు. 'గని' వంటి డిజాస్టర్ తరువాత వరుణ్ తేజ్ సోలో హీరోగా నటించిన సినిమా 'గాండీవధారి అర్జున'. ఇక 'ఏజెంట్' వంటి డిజాస్టర్ తరువాత హీరోయిన్ సాక్షి వైద్య నటించిన చిత్రమిదే. అలాగే 'ది ఘోస్ట్' వంటి ఘోర పరాజయం అనంతరం ప్రవీణ్ సత్తారు నుంచి వచ్చిన మూవీ ఇది. ఇలా.. డిజాస్టర్లతో డీలాపడ్డ ఈ త్రయం నుంచి వచ్చిన 'గాండీవధారి అర్జున'.. శుక్రవారం (ఆగస్టు 25) జనం ముందు నిలిచింది.
ఇక 'గాండీవధారి అర్జున' గురించి పబ్లిక్ టాక్ ఏంటంటే.. కథ చాలా బలహీనంగా ఉందని, కథనం ఇంకా ఘోరంగా ఉందని అంటున్నారు. ఫారిన్ లొకేషన్స్ లో రిచ్ లుక్ తో సినిమాని తీర్చిదిద్దినప్పటికీ.. ఒక్క సీన్ కూడా ఎంగేజింగ్ గా లేదని అంటున్నారు. "పర్యావరణానికి ప్రమాదం కలిగించేలా చెత్తని కుమ్మరించడం" అనే పాయింట్ చుట్టూ తిరిగే సినిమా ఇదని.. ఉద్దేశం మంచిదే అయినా, తీసిన విధానం మాత్రం ప్రేక్షకులపై చెత్త కుమ్మరించినట్లుగా ఉందన్నది పబ్లిక్ రివ్యూ. అంతేకాదు.. "వరుణ్ ఈ దారుణం ఏందయ్యా" అంటూ మెగాప్రిన్స్ కథల ఎంపికపై కామెంట్స్ చేస్తున్నారు.
![]() |
![]() |