Home  »  News  »  'స్పై' రిజల్ట్ పై నిఖిల్ ఎమోషనల్ కామెంట్స్!

Updated : Jul 5, 2023

ఇటీవల 'స్పై'తో ప్రేక్షకులను పలకరించి నిరాశపరిచాడు నిఖిల్. మంచి అంచనాలతో జూన్ 29 న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేక నిరాశపరిచింది. ఇది నిఖిల్ కెరీర్ లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా నిలిచినప్పటికీ.. డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో రెండో రోజు నుంచే కలెక్షన్లు పడిపోయాయి. ఫుల్ రన్ లో ఈ సినిమా బయ్యర్లకు కనీసం ఐదు కోట్ల నష్టాన్ని మిగిల్చే అవకాశముంది అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ గురించి నిఖిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

నిజానికి విడుదలకు కొద్దిరోజుల ముందు 'స్పై' సినిమా అసలు జూన్ 29 న విడుదలవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కాకపోవడం, ప్రమోషన్స్ కి కావాల్సినంత సమయం లేకపోవడంతో సినిమాని వాయిదా వేయడం మంచిదని నిఖిల్ భావించాడు. కానీ మేకర్స్ మాత్రం అప్పటికే డిస్ట్రిబ్యూటర్స్ నుంచి అడ్వాన్స్ లు తీసుకొని ఉండటం, వాయిదా పడితే మళ్ళీ ఇంత బజ్ క్రియేట్ అవుతుందా లేదా అనే అనుమానంతో వాయిదాకి ఒప్పుకోలేదు. ఈ విషయంలో నిఖిల్ కి, నిర్మాతకి మధ్య విభేదాలు వచ్చాయని కూడా వార్తలొచ్చాయి. తాజాగా నిఖిల్ వ్యాఖ్యలు ఆ వార్తలకు బలం చేకూర్చేలా ఉన్నాయి.

'స్పై' ఫలితం గురించి తాజాగా నిఖిల్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. "స్పై సినిమాకి నా కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు. కంటెంట్ ఆలస్యం, ఇతర కారణాల వల్ల స్పై ని విభిన్న భాషల్లో విడుదల చేయలేకపోయాం. ఓవర్సీస్ లో 350 తెలుగు ప్రీమియర్ షోలు కూడా రద్దయ్యాయి. ఈ విషయంలో ప్రేక్షకులకు క్షమాపణలు చెబుతున్నాను. నా తదుపరి సినిమాలను పక్కా ప్రణాళికతో అనుకున్న సమయానికి పూర్తి చేసి, అన్ని భాషల్లో విడుదల చేస్తాం. అలాగే ఈసారి ఎటువంటి ఒత్తిడి ఉన్నా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా మంచి అవుట్ పుట్ ఇస్తానని హామీ ఇస్తున్నాను" అంటూ నిఖిల్ రాసుకొచ్చాడు. నిఖిల్ మాటలను బట్టి చూస్తే రిలీజ్ డేట్ ఒత్తిడి వల్ల స్పై సినిమా అనుకున్నంత అవుట్ పుట్ రాలేదనే అభిప్రాయంలో అతను ఉన్నాడని అర్థమవుతోంది. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.