Home  »  News  »  కళ్యాణ్ రామ్ 'డెవిల్' గ్లింప్స్ అదిరింది.. మరో బ్లాక్ బస్టర్ లోడింగ్!

Updated : Jul 5, 2023

జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నందమూరి కళ్యాణ్ రామ్. గతేడాది 'బింబిసార'తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన, ఈ ఏడాది 'అమిగోస్' రూపంలో పరాజయాన్ని చూశారు. ఇప్పుడు ఆయన మరో ఆసక్తికర చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. అదే 'డెవిల్'. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవీన్ మేడారం దర్శకుడు. కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ విడుదలైంది.

స్వాతంత్య్రానికి ముందు జరిగిన ఒక బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ కథగా 'డెవిల్' రూపొందుతోంది. కళ్యాణ్ రామ్ పుట్టినరోజు(జూలై 5) సందర్భంగా ఈరోజు ఈ మూవీ గ్లింప్స్ ని విడుదల చేశారు. అద్భుతమైన విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. సీక్రెట్ ఏజెంట్ డెవిల్ గా కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రజెన్స్ అదిరిపోయింది. "మనసులో ఉన్న భావన ముఖంలో తెలియకూడదు.. మెదడులో ఉన్న ఆలోచన మాటల్లో బయటపడకూడదు.. అదే గూఢచారి కి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం" అంటూ కళ్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్ మెప్పించింది. గ్లింప్స్ లో సంయుక్త మీనన్ కూడా తళుక్కున మెరిసింది. మొత్తానికి గ్లింప్స్ పీరియాడిక్ సెటప్ లో పవర్ ప్యాక్డ్ గా ఉంది. 'బింబిసార' తర్వాత కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ కలిసి నటిస్తున్న చిత్రమిది. ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్న సంయుక్త మీనన్.. మరోసారి కళ్యాణ్ రామ్ కి 'బింబిసార' వంటి బ్లాక్ బస్టర్ ఇస్తుందేమో చూడాలి.

అభిషేక్ నామ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా కథ అందించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా సుందర్ సి. రాజన్, ఎడిటర్ గా తమ్మిరాజు వ్యవహరిస్తున్నారు. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.