![]() |
![]() |

కిందటి ఏడాది రష్మిక మందన, పూజా హెగ్డే, సాయి పల్లవి, శ్రీలీలా, కృతిశెట్టి, అనుపమ పరమేశ్వరన్... ఇలా పలువురు హీరోయిన్‌లు బిజీగా కనిపించినా.. 'సీతారామం'లో నటించిన మృణాల్ ఠాకూర్ పేరును ముందుగా చెప్పుకోవాలి. కిందటి ఏడాది ఒకే ఒక్క చిత్రంతో అందరినీ కట్టిపడేసిన ఈ భామను హీరోయిన్ ఆఫ్ ది 2022గా చెప్పుకున్నా అది అతిశయోక్తి కాదు. ఆమె తన నటనతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.
'సీతారామం'లో దుల్కర్ సల్మాన్ సరసన ఆమె అద్భుత నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఈ మూవీ ఘన విజయం తర్వాత అమ్మడుకు వరుస అవకాశాలు వస్తున్నాయి. కానీ ఆమె మాత్రం తొందరపడి సినిమాలను ఒప్పుకోవడం లేదు. తనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఒప్పుకునేందుకు జాగ్రత్తలు పడుతోంది. కథ, కంటెంట్, హీరో, బ్యానర్ వ్యాల్యూ... ఇలా చాలా విషయాలను పరిశీలిస్తుంది. తాజాగా ఆమె నేచురల్ స్టార్ నానితో జతకట్టబోతున్న సంగతి తెలిసిందే.
నాని హీరోగా రూపొందనున్న కొత్త చిత్రంలో ఈమెని హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారట. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఎక్కువ భాగం చిత్రీకరణ లండన్‌లో జరగనుంది. నాని కెరీర్ లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందనుంది. ఇది నానికి 30వ చిత్రం కావడం విశేషం. ఒకప్పుడు మైత్రి మూవీ మేకర్స్ లో భాగస్వామిగా ఉన్న చెరుకూరి మోహన్ విడిపోయి తన స్నేహితులతో కలిసి సొంత బ్యానర్ గా వైరా ఎంటర్టైన్మెంట్స్ ను ఆరంభించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో ఆయన నిర్మాతగా పరిచయం అవుతున్నారు.
ఈ చిత్రమే కాదు.. ఇంకా పలు చిత్రాలలో అవకాశాలు మృణాల్ ఠాకూర్‌కు అవకాశాలు వస్తున్నాయి. సౌత్ఇండియా హీరోల చూపు కూడా ఆమెపై ఉంది. దీంతో 2023లో ఈమె తెలుగు వెండితెరపై బిజీబిజీగా మారుతుందనడంలో సందేహం లేదు. ఈ నూతన ఏడాది ముణాల్ ఠాకూర్ కి పూర్తిగా అంకితమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.
![]() |
![]() |