![]() |
![]() |

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు కన్నుమూశారు. కేరళ రాష్ట్రానికి చెందిన సునీల్.. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో పలు చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వివిధ భాషల్లో వరుసగా పలు చిత్రాలకు పని చేస్తున్న 50 ఏళ్ళ సునీల్ హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. గురువారం రాత్రి గుండెపోటు రావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు.
మలయాళంలో 'బెంగళూరు డేస్', 'ప్రేమమ్', తెలుగులో 'మహర్షి', 'సీతా రామం', హిందీలో 'గజిని', 'ఎం.ఎస్ ధోనీ' వంటి సినిమాలకు సునీల్ బాబు పనిచేశారు. ఆయన ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేసిన తమిళ చిత్రం 'వారిసు'(వారసుడు) జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు నాలుగు రోజుల ముందు ఆయన హఠాన్మరణంతో మూవీ టీమ్ షాక్ తో ఉంది. సునీల్ బాబు మృతి పట్ల అన్ని పరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
![]() |
![]() |