![]() |
![]() |

నటసింహం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన 'అఖండ' ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. కోవిడ్, తక్కువ టికెట్ ధరలు వంటి ప్రతికూలతల మధ్య 2021, డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఏడాది తర్వాత ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేయబోతున్నారు. తాజాగా ట్రైలర్ కూడా విడుదలైంది. కానీ డబ్బింగ్ మాత్రం చాలా నాసిరకంగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
నార్త్ ఆడియన్స్ దైవత్వం ఉన్న సినిమాలపై మక్కువ చూపుతారు. 'అఖండ'లో శివుడి సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి కాబట్టి.. కార్తికేయ-2 తరహాలో ఈ సినిమా కూడా హిందీలో మంచి ఆదరణ పొందుతుందని భావించారంతా. జనవరి 20న సినిమాని విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన పెన్ స్టూడియోస్.. తాజాగా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసింది. కానీ హిందీ ట్రైలర్ డబ్బింగ్ పూర్తింగా తేలిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
'అఖండ' చిత్రానికి బాలకృష్ణ ప్రధాన బలం. అఖండ పాత్రలో ఆయన రౌద్రరసం అద్భుతంగా పలికించాడు. ఇక ఆయన చెప్పే డైలాగ్ లు ఎంత పవర్ ఫుల్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి బాలకృష్ణకు డబ్బింగ్ చెప్పాలంటే గొంతు ఎంత పవర్ ఫుల్ గా ఉండాలి. కానీ ట్రైలర్ లో బాలయ్య పాత్రకు చెప్పిన డబ్బింగ్ ఏమాత్రం ప్రభావం చూపేలా లేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలే లేట్ గా రిలీజ్ చేస్తున్నారు.. పైగా ఇలా యూట్యూబ్, ఓటీటీ స్టాండర్డ్ లో డబ్బింగ్ చెప్పించి వదిలితే ఎవరు చూస్తారని ఫైర్ అవుతున్నారు. మరి ఈ కామెంట్స్ ని దృష్టిలో పెట్టుకొని.. ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేస్తున్న పెన్ స్టూడియోస్ డబ్బింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ ఏమైనా తీసుకుంటుందేమో చూడాలి.
![]() |
![]() |