![]() |
![]() |

ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో 'ప్రేమమ్' బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇప్పటివరకు స్కిన్ షోకి దూరంగా ఉంటూ సాధ్యమైనంత ఎక్కువగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఆమె చేస్తూ వస్తోంది. స్కిన్ షోకి దూరంగా ఉండటంతో స్టార్ హీరోలు ఆమెకు ఆఫర్స్ ఇవ్వడం లేదు. స్కిన్ షో చేస్తే ఇప్పుడు ఉన్న క్రేజ్ కూడా పడిపోయి అటు ఇటు కాకుండా నలిగిపోతానని అనుపమ పరమేశ్వరన్ భయపడుతోందట. స్కిన్ షో మొదలు పెడితే నటనా ప్రాధాన్యం ఉన్న పాత్రలు రాకపోగా మరో వైపు స్టార్ హీరోలు అవకాశాలు ఇస్తారనే గ్యారెంటీ లేదని ఆమె ఆవేదనగా తెలుస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఆమె పోయిన ఏడాది 'కార్తికేయ 2', '18 పేజెస్' చిత్రాలతో మంచి విజయాలను దక్కించుకుంది. అయితే ఆమె ఇప్పటివరకు టైర్ 2, టైర్ 3 హీరోల సినిమాల్లో మాత్రమే నటిస్తూ వచ్చింది. స్టార్ హీరోలకు జోడిగా ఈ అమ్మడు నటించేందుకు ఒక్క అవకాశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కీర్తి సురేష్ విషయానికి వస్తే ఆమె కూడా నటనకు ప్రాధాన్యం ఇచ్చే పాత్రలు చేసి మెప్పిస్తుంది. అయినా సరే ఆమెకు మహేష్ బాబు వంటి స్టార్ సరసన అవకాశం వచ్చింది. సాయి పల్లవి అయితే పూర్తిగా స్కిన్ షోకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో పెద్ద హీరోలతో అవకాశం రాకపోయినా ఈ అమ్మడు ఏ మాత్రం నిరాశ చెందడం లేదు. కానీ అనుపమ పరమేశ్వరున్ పరిస్థితి దానికి భిన్నంగా ఉంది.
మనసులో స్టార్ హీరోలతో నటించాలని కోరిక బలంగా ఉన్న ఆమె స్కిన్ షో చేయకపోవడంతో వారి నుండి అవకాశాలు రాక ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో పడి ఉంది. ఇటీవల అల్లు అరవింద్ మాట్లాడుతూ తనకు కూతురు ఉంటే ఇలా ఉండాలి అనుకుంటున్నాను అని ఆమెపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనుపమ పరమేశ్వరన్ పై తన అభిమానం ఆయన సమయం వచ్చినప్పుడల్లా సాధ్యమైనంత ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. ఈ ఏడాది ఆయన గీతా ఆర్ట్స్ లో ఒకసారి స్టార్ హీరో సినిమాలో అయినా అనుపమ పరమేశ్వరన్ కు అవకాశం ఇచ్చి తన అభిమానం చూపించాలని అనుపమ అభిమానులు కోరుకుంటున్నారు.
అయితే కొందరు మాత్రం వెటకారంగా కూతురు అన్నట్లుగా చూసుకుంటున్నాడు కాబట్టి తన కుమారుడి పక్కన అంటే బన్నీ సరసన అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదు అని అంటున్నారు. మరికొందరేమో ఈ మెగా నిర్మాత తలుచుకుంటే మాత్రం ఆమె స్టార్ హీరోలకు జోడిగా నటించడం పెద్ద కష్టమేమీ కాదు అని అభిప్రాయపడుతున్నారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్లుగా అల్లు అరవింద్ నిజంగా ఆమెకి కెరీర్ పరంగా లిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటే అది పెద్ద పనేమీ కాదు. ఇలాంటి సమయంలో అనుపమ పరమేశ్వరన్ కు ఈ కొత్త ఏడాది అంటే 2023 అగ్ని పరీక్ష కానుందనే చెప్పాలి...!
![]() |
![]() |