![]() |
![]() |

'బింబిసార' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న నందమూరి కళ్యాణ్ రామ్ త్వరలో మరో చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. అదే 'ఎమిగోస్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేంద్ర రెడ్డి దర్శకుడు. ఇందులో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం పోషిస్తుండటం విశేషం.

'ఎమిగోస్'లో కళ్యాణ్ రామ్ మూడు విభిన్న పాత్రలలో అలరించనున్నాడు. ఇటీవల రెండు పాత్రలకు సంబంధించిన పోస్టర్స్ విడుదలయ్యాయి. ఒక పాత్రలో సిద్ధార్థ్ గా కాస్త మోడ్రన్ గా, మరోపాత్రలో మంజునాథ్ గా కాస్త అమాయకంగా కళ్యాణ్ రామ్ కనిపించిన తీరు ఆకట్టుకుంది. ఇక మూడో పాత్రకి సంబంధించిన లుక్ ని తాజాగా రివీల్ చేశారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో పవర్ ఫుల్ గా ఉన్న కళ్యాణ్ రామ్ గెటప్ ఆకట్టుకుంటోంది. ఆయన ఆహార్యం చూస్తుంటే నెగటివ్ రోల్ అని అర్థమవుతోంది. తాజా పోస్టర్ తో ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెరిగాయి అనడంలో సందేహం లేదు.

అలాగే ఈ చిత్ర టీజర్ ని జనవరి 8న ఉదయం 11:07 కి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఫిబ్రవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |