![]() |
![]() |

'ఆర్ఆర్ఆర్'తో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఇప్పటికే పలు పురస్కారాలు, ప్రశంసలు పొందిన ఆయన తాజాగా మరో ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు గెలుచుకున్నారు. న్యూయార్క్ లో జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా రాజమౌళి పాల్గొన్నారు. మాములుగా ఇలాంటి ఇంటర్నేషనల్ వేడుకులకు సూట్ ధరిస్తారు. కానీ రాజమౌళి మాత్రం సాంప్రదాయ దుస్తుల్లో కనిపించి ఆకట్టుకున్నారు.

'ఆర్ఆర్ఆర్' చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని రాజమౌళి అన్నారు. తన దృష్టిలో సినిమా అంటే దేవాలయమని చెప్పారు. సినిమాలో ప్రతి సీన్ షూట్ చేసేముందు.. ఈ సీన్ థియేటర్ లో ఎలా ఉంటుందని ఒక ప్రేక్షకుడిలా ఆలోచిస్తానని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను ఆకట్టుకోవడం కోసం సినిమా చేస్తానని, కానీ ఆర్ఆర్ఆర్ కి విదేశీయుల అభిమానం కూడా పొందటం ఆనందంగా ఉందన్నారు. తన సినిమాల విజయంలో కీలక పాత్ర పోషిస్తున్న కుటుంబసభ్యులకి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పుకొచ్చారు. అలాగే ఈ సందర్భంగా ఆయన ఆర్ఆర్ఆర్ టీమ్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
![]() |
![]() |