![]() |
![]() |

డివైన్ బ్లాక్‌బస్టర్‌గా వరల్డ్ వైడ్ ఫేమ్ తెచ్చుకున్న సినిమా కాంతార. రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించారు. అతను డైరక్ట్ చేసిన కిరిక్ పార్టీ ద్వారానే రష్మిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో ఆమెకు కాంతారా సినిమాను చూశారా? అనే ప్రశ్న ఎదురైంది. కాంతార సినిమా చూడలేదని రష్మిక చెప్పడం, మూలాలను మర్చిపోవద్దని నెట్టింట్లో ఆమెను ట్రోల్ చేయడం తెలిసిందే. ఈ ఇష్యూ మీద లేటెస్ట్ గా స్పందించారు కిచ్చా సుదీప్.
``మారుతున్న ప్రపంచాన్నిమనం ఎలా మార్చగలం? 15- 20 ఏళ్ల క్రితం ఇంత మీడియా లేదు. చానెళ్ల ఇంటర్వ్యూలు లేవు. రాజ్‌కుమార్ సార్ హయాంలో దూరదర్శన్, పేపర్లు మాత్రమే ఉన్నాయి. అంతకు ముందు అది కూడా ఉండేది కాదు. జనాలకు చాలా విషయాలు తెలిసేవి కావు. ఇప్పుడు మీడియా పెరిగిపోయింది. అలాంటి తరుణంలో జాగ్రత్తగా ఉండాలి. పబ్లిక్ ఫిగర్ అయ్యాక మనం ఎప్పుడూ దండలూ, బొకేలు మాత్రం ఎక్స్ పెక్ట్ చేయకూడదు. అక్కడే టమోటాలు, గుడ్లు, రాళ్లు కూడా ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మానసికంగా స్ట్రాంగ్‌గా అవ్వాలి. వాటన్నిటినీ ఎదుర్కోవడం నేర్చుకోవాలి.
ఇవన్నీ అర్థం చేసుకోగలిగితే, మన మాటలను చాలా జాగ్రత్తగా వాడుతాం. ఎలా మాట్లాడుతున్నాం? ఏం మాట్లాడుతున్నాం? అనే విషయాల మీద ఫోకస్ చేస్తాం. ఫేస్‌బుక్‌లోనూ, ట్విట్టర్‌లోనూ పది మిలియన్ల మంది ఫాలోయర్లు కావాలనుకున్నప్పుడు, నెగటివిటీ మాత్రం వద్దనుకుంటే ఎలా?`` అని అన్నారు. చంద్రు డైరక్షన్‌లో కబ్జా మూవీ చేస్తున్నారు సుదీప్. ఉపేంద్ర ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నారు. శ్రియా శరణ్ ఇందులో నాయిక. 80ల్లో జరిగే కథతో తెరకెక్కుతోంది కబ్జా.
![]() |
![]() |